షూటింగ్ పూర్తవ్వకుండా విడుదల ఇంకా చాలా దూరం ఉండగానే కేవలం ఒక్క చిన్న టీజర్ కోసం రిలీజ్ రేంజ్ లో థియేటర్ దగ్గర భారీ ఎత్తున హంగామా జరగడం బహుశా ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో ఇలాంటి ఈవెంట్లు చేసినప్పటికీ అవన్నీ నిర్మాణం చివరి దశలో ఉన్నవే ఎక్కువ. కానీ దర్శకుడు హరీష్ శంకర్ తన చేతిలో ఉన్న కాసింత ఫుటేజ్ తోనే అభిమానులకు గూస్ బంప్స్ ఎలా తెప్పించాలో పక్కాగా ముందే ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు సరిపడా సీన్లు డైలాగులు రాసుకుని వాటినే ఫ్యాన్స్ కోసం కానుకగా ఇచ్చాడు.
నిమిషం కూడా లేని వీడియోని మొత్తం పవన్ స్వాగ్ తో నింపేశారు. భగవద్గీత శ్లోకం, స్టైలిష్ ఇంట్రో, పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించడం, అఫ్జల్ గంజ్ ఇన్స్ పెక్టర్ గా ఛార్జ్ తీసుకుని పాత బస్తీ గుండాలకు వార్నింగ్ ఇవ్వడం, చివర్లో ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుందని డైలాగు చెప్పడం మొత్తం ఊర మాస్ స్టైల్ లో సాగింది. భీమ్లా నాయక్ లో పవన్ ఇలాంటి కిక్ ఇచ్చే అవతారం చూపించినప్పటికీ గబ్బర్ సింగ్ ని తలదన్నే పోలీస్ వేషంలో ఇంకోసారి చూడాలని అభిమానులు ఎదురు చూశారు. దానికి తగ్గట్టే హరీశ్ శంకర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. స్టేషన్ సీన్లలో ఎక్కువ వోల్టేజ్ పెట్టినట్టు ఉంది.
దీన్ని బట్టి సినిమా మీద పూర్తిగా అంచనాకు రాలేం కానీ అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే చిన్న మెతుకు చూడాలన్న సామెత లాగా ఆ కోణంలో చూస్తే మాత్రం తేరి రీమేకనే అభిప్రాయం క్రమంగా మనసులో తగ్గడం ఖాయమే. దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన హరీష్ శంకర్ ఈసారి కూడా అలాంటి ట్రీట్ మెంట్ తో వస్తే బ్లాక్ బస్టర్ ఖాయమే. శ్రీలీలను జస్ట్ అలా బ్యాక్ షాట్ లో చూపించి వదిలేశారు. దేవి మార్కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండనే ఉంది. ఏదైతేనేం కొద్దిరోజులుగా చప్పగా ఉన్న సోషల్ మీడియాకు పవన్ ఊపు తెచ్చేశాడు
This post was last modified on May 11, 2023 6:41 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…