అక్కినేని నాగార్జున గతంలో బహు భాషా దర్శకులతో పని చేశాడు. తమిళం నుంచి కూడా పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు తీశారు. ఇదే కోవలో వెంకట్ ప్రభు సైతం నాగ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట. ప్రస్తుతం నాగ్ కొడుకు నాగచైతన్యతో ఆయన ‘కస్టడీ’ తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దర్శకుడితో నాగ్ సినిమా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో అది క్యాన్సిల్ అయిందట.
దాని గురించి వెంకట్ ప్రభు మీడియాకు వివరిస్తూ.. “నేను తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాను. కానీ కుదరడం లేదు. అజిత్ గారితో తీసిన ‘మన్కాతా’ సినిమాను తెలుగులో సమాంతరంగా నాగార్జున గారితో చేయడానికి సంప్రదింపులు జరిగాయి. కానీ కొన్ని కారణాలతో అది కుదరలేదు. తర్వాత ‘మానాడు’ సినిమాను కూడా ఒకేసారి తెలుగులో వేరే హీరోగా చేయాాలనుకున్నా. కానీ అదీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ‘కస్టడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా” అని వెంకట్ తెలిపాడు.
‘కస్టడీ’ సినిమా కథకు స్ఫూర్తి ఒక మలయాళ చిత్రం అని చెబుతూ.. చైతూనే ఎందుకు ఇందులో లీడ్ రోల్ కోసం తీసుకున్నది వెంకట్ వెల్లడించాడు. “మలయాళంలో నాయట్టు సినిమా నాకు బాగా నచ్చింది. అందులో ప్లాట్ పాయింట్ చూసి స్ఫూర్తి పొందాను. ఆ పాయింట్‌తో ఒక కమర్షియల్ కోణంలో సినిమా ఎందుకు తీయకూడదు అని ‘కస్టడీ’ కథ రాశాను. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఒక పాట చూస్తుంటే నా పాత్రకు చైతూనే సరిపోతాడు అనిపించి అతడికి కథ వినిపించాను. తనకు నచ్చి ఈ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాకు శివ అనే టైటిల్ పెడదామనుకున్నా. కానీ చైతూ వద్దన్నాడు” అని తెలిపాడు.
This post was last modified on May 11, 2023 2:01 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…