స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ ని సెట్ చేసుకోవడం ఎంత కష్టమో సరైన విలన్ ని దొరకబుచ్చుకోవడం అంతకంటే పెద్ద సవాల్ గా మారుతోంది. అప్పుడెప్పుడో ఆశిష్ విద్యార్ధి, ముఖేష్ ఋషి, షియాజీ షిండేల రూపంలో మంచి బాలీవుడ్ బ్యాచ్ ఉండేది కానీ క్రమంగా అది తగ్గిపోయింది. ఒకపక్క రావు రమేష్, ప్రకాష్ రాజ్ లు రొటీన్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా తెలివైన సెలక్షన్ చేసుకున్నారు. బాలకృష్ణతో చేస్తున్న ఎన్బికె 108 కోసం అర్జున్ రామ్ పాల్ ని తీసుకొచ్చాడు. ఈ మేరకు చిన్న వీడియోతో అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు
నిజానికి అర్జున్ రామ్ పాల్ ని మొన్న ఏడాది హరిహర వీరమల్లు కోసం ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రాజెక్టులో విపరీతమైన ఆలస్యం జరగడంతో పాటు డేట్ల సమస్య వల్ల తప్పుకున్నాడు. ఆ స్థానంలోనే బాబీ డియోల్ వచ్చి చేరాడు ఇప్పుడు బాలయ్యతో ఢీ కొట్టబోతున్నాడు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటున్న వాళ్లకు ఇతను పరిచయమే. 2001లో ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ తో తెరంగేట్రం చేసి చెప్పుకోదగ్గ హిట్లైతే సాధించాడు. తర్వాత పోటీగా వచ్చిన జాన్ అబ్రహంలాగా దూకుడు చూపించలేక సినిమాలు వేగంగా చేయడం తగ్గించాడు
మొత్తానికి అనిల్ రావిపూడి డిఫరెంట్ క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్నాడు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురి పాత్రగా ప్రచారంలో ఉన్న శ్రీలీల ఇదంతా చూస్తే ఏదో డిఫరెంట్ స్టోరీని చూపించబోతున్న అభిప్రాయమైతే కలిగుతోంది. పటాస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ టచ్ ఇందులోనే ఉంటుందని యూనిట్ టాక్. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ మూడోసారి బాలయ్య కోసం ట్యూన్లు కడుతున్నాడు. విజయదశమికి విడుదల కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పోటీగా రామ్ బోయపాటి, లియో, టైగర్ నాగేశ్వరరావులు రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే
This post was last modified on May 10, 2023 3:31 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…