1996 నాటికీ విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన పేరొచ్చింది. అన్నయ్య నిర్మాత సురేష్ బాబుకి ఎక్కడో యూత్ ని మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంత తక్కువ వయసులో శోభన్ బాబు టైపు పాత్రలు వరసగా చేస్తే మాస్ కి యువతకు దూరమయ్యే ప్రమాదం ఉందని గుర్తించి సరైన కథ కోసం చూస్తుండగా దీనరాజ్ ఇచ్చిన స్టోరీ బ్రహ్మాండంగా నచ్చింది. తమ సంస్థలో పని చేస్తూ అప్పటికే ఒక ఛాన్స్ చేజారి దర్శకత్వ అవకాశం కోసం ఎదురు చూస్తున్న జయంత్ సి పరాంజీకి ఆ బాధ్యతను అప్పగించారు. రచయితలు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు.
హైదరాబాద్ కుర్రాడు రాయలసీమ అమ్మాయి ప్రేమించుకోవడం ఇందులో మెయిన్ పాయింట్. దాని చుట్టూ తగినంత కామెడీ, హీరోయిన్ తండ్రి సెంట్రల్ పాయింట్ గా కరుడుగట్టిన ఫ్యాక్షన్ విలనిజం ని హైలైట్ చేస్తూ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకున్నారు. విలన్ పాత్రధారి కోసం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఒకదశలో బాలీవుడ్ నుంచి నానా పటేకర్ లాంటోళ్ళను తీసుకొద్దామనుకున్నారు. కానీ సురేష్ బాబుకి నచ్చలేదు. ఆఖరికి అవకాశం జయప్రకాష్ రెడ్డిని వరించింది. స్వతహాగా నంద్యాలకు చెందిన ఈయన ఇందులో డైలాగులను సీమ యాసలో చెప్పడం కోసం స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్లొచ్చారు
హీరోయిన్ సెలక్షన్ కోసం నెలల తరబడి ఆడిషన్లు చేస్తే ఫైనల్ గా అంజలా ఝవేరి ఓకే అయ్యింది. సంగీత దర్శకుడు మహేష్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డెప్త్ కోసం మణిశర్మకు బీజీఎమ్ ఛాన్స్ ఇచ్చారు. కీలకమైన శివుడు క్యారెక్టర్ కు రియల్ స్టార్ శ్రీహరి ప్రాణం పోశారు. ఇలా అన్నీ జతకూడిన ప్రేమించుకుందాం రా 1997 మే 9 న రిలీజై సురేష్ బాబు కోరుకున్నట్టు కాలేజీ విద్యార్థులను ఊపేసింది. మాస్ కి సైతం విపరీతంగా ఎక్కేసింది. యాభై కేంద్రాల్లో వంద రోజులు ఆడటం ఆ టైంలో రికార్డు. తర్వాత ఈ రా పరంపరలో చాలా సినిమాలు వచ్చాయి
This post was last modified on May 10, 2023 7:39 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…