ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథల్లో సీతారామం ఒకటి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఎంతో మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదిలిపోయారు.
ఫిలిం సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా అందులో ఒకరని ఇప్పుడే తెలిసింది. సీతారామం తనకు ఎంతో నచ్చిన.. తనను ఎమోషనల్‌గా కదిలించిన సినిమా అని ఆయన వైజయంతీ వారి కొత్త చిత్రం అన్నీ మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు. సీతారామం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి అదృష్టం కలిసి వస్తుందని.. పెద్ద హిట్టవుతుందని చెబుతూ.. సీతారామం చిత్రానికి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నను కోరారు.
సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని.. ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయనే చెప్పడం విశేషం. రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకుని సీత విలన్ దగ్గరికి వెళ్తుందని.. అప్పుడు అతను నీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని.. అక్కడి నుంచి రామ్‌ను విడిపించుకుని వచ్చాక.. సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని.. ఇలా ప్లాట్ పాయింట్ తీసుకుని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు.
సీత గురించి ఇప్పుడు తలుచుకున్నా తన కళ్లో నీళ్లు తిరుగుతాయని.. ఆమె కథను కొనసాగించాలని.. తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు చెప్పగా.. స్వప్న, అల్లు అరవింద్ సహా అక్కడున్న అందరూ నవ్వేశారు.
This post was last modified on May 9, 2023 6:27 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…