ఏ స్టార్ హీరో లేనంత బిజీగా వరస సినిమాలతో తలమునకలై ఉన్న ప్రభాస్ ఇంకా అనౌన్స్ చేయనివి, గతంలో కమిట్ మెంట్స్ ఇచ్చినవి కొన్నున్నాయి. అందులో మైత్రి మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా మూవీ ప్రధానమైంది. మొన్న ఏడాదే పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఇది ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు 75 కోట్ల పారితోషికం మాట్లాడుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే అతను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్న ఫైటర్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలి. హెవీ బడ్జెట్ మూవీ కావడంతో నెలల తరబడి సమయం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది .
ఇదంతా ఒక ఎత్తయితే టైగర్ వర్సస్ పఠాన్ స్క్రిప్ట్ ఏడాది పైగానే టైం డిమాండ్ చేస్తోంది. ఇది 2024లో ప్రారంభించి ఆపై ఏడాది విడుదల ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రభాస్ తో చేయాలని సిద్దార్థ్ ఆనంద్ కున్నా కనీసం కథ కూడా రెడీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే వార్ 2 చేతులారా అయాన్ ముఖర్జీకి వదులుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే అడ్వాన్స్ ని సిద్దార్థ్ మైత్రి నిర్మాతలకు వెనక్కు ఇచ్చేసినట్టు ముంబై టాక్. భవిష్యత్తులో మళ్ళీ కాంబినేషన్ సెట్ చేసుకునేలా ఓ మాట అనుకుని డ్రాప్ అయ్యారట. మొత్తానికి క్రేజీ కాంబో అలా మిస్ అవుతోంది
ఒకపక్క పుష్ప 2 షూటింగ్ ఒత్తిడి, ఖుషి తాలూకు వ్యవహారాలు, ఇటీవలే జరిగిన ఐడి దాడుల తాలూకు తలనెప్పులు ఇలా నవీన్ రవిశంకర్ ల మీదున్న ప్రెజర్ అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న వీరసింహారెడ్డి శతదినోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. మళ్ళీ చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ మళ్ళీ అనుకున్నా వాల్తేరు వీరయ్యకు కూడా చేయాల్సి ఉంటుంది. సో దాదాపు రెండూ డ్రాపే. ఇక ప్రభాస్ ఆది పురుష్ ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నాడు. సలార్ బాలన్స్ జూన్ ఆఖరులో స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ కె, మారుతీ మూవీ సమాంతరంగా జరుగుతాయి