టీడీపీ ఇప్పుడు జోష్ మీదుంది. అందరూ వచ్చి ఆ పార్టీలోనే చేరాలనుకుంటున్నారు. ఆ క్రమంలో ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కూడా పచ్చ కండువా కప్పుకున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన టీడీపీలో చేరడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లయ్యింది. చంద్రబాబు కూడా కన్నాను హృదయపూర్వకంగానే ఆహ్వానించారు.
నాన్చుడు నారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు నాన్చుడు నారాయణ అని పేరు ఉంది. ఏ విషయాన్నైనా ఆయన త్వరగా తేల్చరు, తెమల్చరని చాలా విషయాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కన్నా విషయంలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. రెండు నెలల క్రితం కన్నా చేరిన రోజు ఇంకేముందీ అంతా అయిపోయింది ఏదోక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడమేనని చర్చ జరిగింది. ఇంతవరకు అతీ లేదు, గతీ లేదని కన్నా అభిమానులు వాపోతున్నారు. గుంటూరు నగరంలోని ఒక నియోజకవర్గం, సత్తెనపల్లి, పెదకూరపాడులో ఏదో ఒక దాన్ని కన్నా చేతిలో పెట్టేస్తారని ఎదురు చూశారు. చంద్రబాబు నోట ఇంతవరకు ఆ మాట రాలేదు.
మరో వారంలో..
కన్నా అనుచరులు ఇప్పుడో లెక్క వేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఆయన్ను సత్తెనపల్లి ఇంఛార్జ్ గా నియమిస్తారని అంటున్నారు. అప్పుడు కన్నా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారన్నది పరోక్ష సంకేతంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సత్తెనపల్లిలో కన్నా రెండు రౌండ్లు తిరిగినందుకు ఇబ్బందేమీ ఉండదని కూడా భావిస్తున్నారు..
ఆశావహులు ఎక్కువే..
సత్తెనపల్లి వైపు కన్నా రాకుండా ఉంటే బావుండునని చాలా మంది టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం చాలా ఆశలు పెట్టుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన శివరాం.. ఆ పని మానేసి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి దిగిపోయారు. ఇటీవలే గుంటూరులో తన తండ్రి వర్థంతి కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు పెద్దలను పిలిచి హడావుడి చేశారు. మరో పక్క అబ్బూరు మల్లీ సహా పలువురు అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మాత్రం కన్నా వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కాకపోతే నాన్చుడు మానేసి త్వరలో ప్రకటిస్తే బావుంటుందని కన్నా కూడా తన అనుచరులతో అంటున్నారట…
This post was last modified on May 4, 2023 9:28 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…