రేపు విడుదల కానున్న ది కేరళ స్టోరీ మీద పెద్ద వివాదాలే చుట్టుముట్టాయి. ఇంకో ఇరవై నాలుగు గంటల్లో షోలు పడబోతున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. తమిళనాడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి తమ నిఘా రిపోర్ట్ ని ఇవ్వడంతో స్క్రీనింగ్ కి సంబంధించిన నిర్ణయం ఈ రోజు తీసుకోబోతున్నారు. కేరళ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బయ్యర్లను ఒత్తిడి చేయకుండా ఇష్టం ఉంటే వేసుకోవచ్చని భద్రతకు ఎవరి బాధ్యత ఉండదని ముందస్తుగానే తేల్చి చెప్పింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏపీ తెలంగాణలో రేపే రానుంది.
ఇంత కాంట్రావర్సీ నెలకొన్న పరిస్థితిలో సినిమాని వీలైనంత త్వరగా చూసేందుకు మూవీ లవర్స్ రెడీ అవుతున్నారు. కంటెంట్ ఏ స్థాయిలో ఉందో ట్రైలర్ లో ఆల్రెడీ శాంపిల్ చూపించారు. ఒకవేళ సినిమా మొత్తం ఇలా ఉంటే నిరసనలు, అడ్డుకోవడాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే ఈ ఇష్యూ మీద రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయాయి. కొందరు ప్రజాస్వామ్యంలో ఇలా వ్యతిరేకత చూపడం సరికాదని అంటుంటే మరికొందరు క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో మతాల మధ్య మనోభావాలు రెచ్చగొట్టవద్దని హితవు పలుకుతున్నారు. ఇలా హాట్ డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి
నితిన్ హార్ట్ అటాక్, సాయిధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో మెరిసిన అదా శర్మ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ ఐసిఎస్ లో చేరేందుకు శత్రువులు పన్నిన కుట్రలో ఇరుక్కుని మతం మారి పెళ్లి చేసుకుంటుంది. తీరా అక్కడికి వెళ్ళాక పడిన నరకం ఎలా ఉంటుందనే పాయింట్ మీద దర్శకులు సుదిప్తో సేన్ ది కేరళ స్టోరీని రూపొందించారు. మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథగా ప్రెజెంట్ చేశారు. మరి షోలు పడక ముందే ఆగిపోతుందా లేక ఎలాంటి అడ్డంకులు లేకుండా వస్తుందా వెయిట్ అండ్ సీ
This post was last modified on May 4, 2023 11:34 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…