టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు ఆఫర్ల వర్షం ఆగడం లేదు. పట్టుమని అయిదు సినిమాలు రిలీజ్ కాకుండానే డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకో రెండు మూడేళ్ళ దాకా కాల్ షీట్స్ లేవనేంత బిజీగా మారిపోయింది. ఇవాళ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రంలో తనే కథానాయికగా లాక్ అయ్యింది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సోషల్ ఇష్యూ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ పోలీస్ డ్రామా నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతోందని టాక్.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్ద లైనప్ ఉంది. మహేష్ బాబు 28, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ బోయపాటి కాంబో, నితిన్ వక్కంతం వంశీల ప్రాజెక్ట్, వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ, బాలకృష్ణ అనిల్ రావిపూడిల ఎన్బికె 108 ఇలా లిస్టు చాంతాడంత ఉంది. ఇవన్నీ రిలీజయ్యేలోగా 2024 దాదాపు గడిచిపోతుంది. అయితే కాల్ షీట్స్ పరంగా ఇబ్బంది రాకుండా ఇవన్నీ ఈ ఏడాదే పూర్తి చేసుకునేలా శ్రీలీల డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. మరో అయిదారు సినిమాలు తన అంగీకారం కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ కన్నడ ఆఫర్లు వేరుగా ఉన్నాయి.
వరస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ఖుషితో పాటు దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చుకుని ఇందులో కనిపించబోతున్నట్టు వినికిడి. అమితాబ్ బచ్చన్ జంజీర్, రాజశేఖర్ అంకుశం రేంజ్ లో పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధమయ్యిందని తెలిసింది. రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా చేయి జారాక గౌతమ్ తిన్ననూరికి సైతం సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలి. హిందీ జెర్సీ రీమేక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. సో ఇప్పుడు కంబ్యాక్ అవ్వాల్సింది దీంతోనే. అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది
This post was last modified on May 3, 2023 5:00 pm
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…