Movie News

సోగ్గాడే దర్శకుడికి మెగా ఛాన్స్

సోగ్గాడే చిన్ని నాయనతో నాగార్జునకి కెరీర్ హయ్యెస్ట్ ఇచ్చి తిరిగి దాని సీక్వెల్ బంగార్రాజు రూపంలో తండ్రితో కలిపి చైతుకి ఓ మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ మధ్య బయట కనిపించడం తగ్గించేశాడు. ఎవరితో కాంబినేషన్ సెట్ కాక చాలా రోజులుగా వెయిటింగ్ లో ఉన్నాడు. అంత సుదీర్ఘ నిరీక్షణకు తగ్గ ఫలితం దొరికిందని లేటెస్ట్ అప్డేట్. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే ఒప్పించారని తెలిసింది. నేను లోకల్, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ రైటర్ గా ఎదిగిన ప్రసన్న కుమార్ బెజవాడ ఇచ్చిన కథ మెగాస్టార్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు వినికిడి.

ప్రస్తుతం భోళా శంకర్ ని పూర్తి చేయడం మీద సీరియస్ గా దృష్టి పెట్టిన చిరంజీవి దాని తర్వాత ఎవరితో చేస్తారనే కన్ఫ్యూజన్ మెగా ఫాన్స్ లో విపరీతంగా ఉంది. వెంకీ కుడుములుతో నిర్మాత డివివి దానయ్య చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో అదింకా ఎక్కువయ్యింది. ఈలోగా కళ్యాణ్ కృష్ణ నెరేషన్ తో చిరుని మెప్పించడం, ప్రొసీడ్ అవ్వమని చెప్పడం లోలోపల జరిగిపోయాయట. ఎంటర్ టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ బాగా డీల్ చేస్తాడని పేరున్న కళ్యాణ్ కృష్ణకు రవితేజతో చేసిన నేల టికెట్టు ఒక్కటే చేదు అనుభవాన్ని మిగిల్చింది. మిగిలినవన్నీ హిట్లే

వాల్తేరు వీరయ్య తర్వాత తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గుర్తించిన చిరంజీవి దర్శకుల ఇమేజ్ మార్కెట్ కంటే ఎక్కువగా కథకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కాస్త కామెడీ యాక్షన్ ని జోడిస్తే చాలు వంద కోట్లు కొట్టేయొచ్చని ఋజువు కావడంతో గాడ్ ఫాదర్ లాంటి ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట కూడా చిరు దగ్గర ఓకే చేయించుకున్నాడు. ఇది కూడా ఒకేసారి సెట్స్ పైకి వెళ్లొచ్చు. దీని నిర్మాత యువి బ్యానర్ కాగా కళ్యాణ్ కృష్ణది మెగా తనయ సుస్మిత కొణిదెల ప్రొడక్షన్ లో ఉంటుంది

This post was last modified on May 3, 2023 4:35 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago