దుర్గారావు.. టిక్ టాక్ ఫాలో అవుతూ వచ్చిన తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. గోదారవి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి టిక్ టాక్‌లో సూపర్ పాపులర్. టిక్ టాక్‌కే తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా ఆయన ఆయన అందులో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దుర్గారావు మాత్రమే కాదు.. ఆయన భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు ప్రతి రోజూ టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లు.
వాళ్ల ఉపాధి ఏంటో.. కుటుంబం ఎలా గడుస్తుందో కానీ.. రోజూ కొన్ని గంటల పాటు సమయాన్ని వెచ్చించి వీడియోలు చేసేవాళ్లు. అవి కామెడీగా అనిపిస్తూనే జనాలకు వినోదం పంచేవి. ఈ కుటుంబాన్ని ముందు కామెడీ చేసిన వాళ్లందరూ కూడా వాళ్ల వీడియోలను చూడకుండా ఉండలేని పరిస్థితి. ఎవరేమన్నా పట్టించుకోకుండా అమాయకంగా వీడియోలు చేస్తూ వెళ్లిన దుర్గారావు కుటుంబం తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.
ఐతే ఈ మధ్య టిక్ టాక్ నిషేధంతో ఇలాంటి వాళ్లందరికీ పెద్ద షాక్ తగిలింది. అయితేనేం దుర్గారావు అండ్ ఫ్యామిలీ రొపోసో లాంటి వేరే యాప్‌ల్లోకి అడుగు పెట్టి మళ్లీ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. సోషల్ మీడియాలో దుర్గారావు అని కొడితే పదుల లెక్కలేనన్ని టిక్ టాక్ వీడియోలు.. ఆయన గురించి చర్చలు కనిపిస్తాయి. కామెడీగానో మరోలానో దుర్గారావుకు క్రేజ్ అయితే తక్కువగా లేదు. ఈ మధ్య ‘ఢీ’ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఓ పాటలో డ్యాన్సర్లతో పాటు హైపర్ ఆది తదితరులు దుర్గారావు, ఆయన భార్యను అనుకరిస్తూ స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా దుర్గారావు, ఆయన భార్య నేరుగా తెరంగేట్రం చేసే రోజూ వచ్చేసింది. వీళ్లిద్దరూ త్వరలోనే ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో కనిపించనున్నారు. హైపర్ ఆది స్కిట్లోనే వీళ్లు కనిపించనున్నారు. వీరి మీద స్కిట్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా హైపర్ ఆది, రోజాలతో కలిసి దుర్గారావు, ఆయన భార్య దిగిన ఫొటోలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 5, 2020 5:24 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…