ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వంత సినిమాలకే ప్రమోషన్ చేసుకోలేనంత బిజీగా హీరోలున్నారు. ఒకవేళ లేకపోయినా పక్కోళ్లది మనకెందుకు అనుకునే బాపతే ఎక్కువ. కానీ అల్లరి నరేష్ ఫ్రెండ్స్ మాత్రం తాము ఆ టైపు కాదంటున్నారు. శుక్రవారం విడుదల కాబోతున్న ఉగ్రంకు తమ వంతు తోడ్పాటు అందించేందుకు నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, ఆడవి శేష్ లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ట్రెండింగ్ ఆడియోలను తీసుకుని వాటికి నరేష్ రియాక్షన్లు ఇచ్చినట్టు నటించి షేర్ చేసుకున్నాడు. ఒక్కొకటి కొద్ది సెకండ్లు మాత్రమే ఉన్నా ఇంపాక్ట్ ఇస్తున్నాయి.
సహజంగానే ఇవి ఆయా అభిమానులను ఆకట్టుకుంటాయి. నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో రెండో సారి జట్టు కట్టిన అల్లరి నరేష్ అవుట్ ఫుట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇన్నేళ్లు కామెడీ ఎమోషన్స్ అన్నీ పండించినా ఇందులో ఉగ్ర రూపం వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ కొన్ని సీన్లు చూసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ అది నిజమే అనిపించేలా ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఉగ్రం బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నాయి. ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు లేవు కానీ టాక్ చాలా కీలకం కానుంది.
మొన్న వచ్చిన ఏజెంట్ డిజాస్టర్, పొన్నియిన్ సెల్వన్ 2 యావరేజ్ ఫలితాల వల్ల ఉగ్రంకు థియేటర్ల పరంగా ఇబ్బంది లేదు అయితే అదే రోజు వస్తున్న గోపిచంద్ రామబాణం వల్ల బిసి సెంటర్స్ లో పోటీని ఎదురుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆడియన్స్ కి బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. వేసవిలో హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువయ్యాయి. సో ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే ఉగ్రం రూపంలో మరో హిట్టు పడ్డట్టే. పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ ఇందులో మూడు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కనక క్లిక్ అయితే మరిన్ని సీరియస్ రోల్స్ ఆశించవచ్చు.
This post was last modified on May 2, 2023 3:25 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…