టాలీవుడ్ మోస్ట్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది సంయుక్త మీనన్. మాతృ పరిశ్రమ కేరళలోనూ ఇన్ని వరస హిట్లు తనకు ఎప్పుడూ లేవు. ఆ మాటకొస్తే అక్కడ ఫామ్ తగ్గాకే ఇక్కడ అనుకోకుండా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇటీవలే వచ్చిన విరూపాక్షలో తన పెర్ఫార్మన్స్ ఆ సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర పోషించిందో చూశాం. నటనకు ఇంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఈ మధ్య హీరోయిన్లకు దొరకడం లేదు. కేవలం ఆటపాటలకు పరిమితం కాకుండా ఒక ఛాలెంజ్ లాగా దర్శకుడు కార్తీక్ దండు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకుని మెప్పించింది.
తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సంయుక్తకు ఓ భారీ ఆఫర్ వచ్చిందట. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ముందుంది. స్టోరీ లైన్ కూడా ఓకే అయ్యిందట. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి హామీ వచ్చేసిందని ఇన్ సైడ్ టాక్. సితార సంస్థలో భీమ్లా నాయక్, సర్ రూపంలో రెండు సూపర్ హిట్లు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. మధ్యలో బింబిసార బయట బ్యానర్. విరూపాక్షలో తిరిగి మెగా హీరోతో జట్టు కట్టింది. ఇప్పుడు బన్నీ సరసన నిజంగా ఓకే అయితే అంత కన్నా పెద్ద ప్రమోషన్ ఉండదు.
ఇది ఖరారు కావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే పుష్ప 2 పూర్తవ్వడానికి ఎంతలేదన్నా ఈ ఏడాది గడిచిపోతుంది. మహేష్ బాబు 28 సంక్రాంతికి రిలీజైతే కానీ త్రివిక్రమ్ ఫ్రీ అవ్వరు. ఈలోగా బన్నీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే ఛాన్స్ లేకపోలేదు. కళ్యాణ్ రామ్ తో రెండోసారి జట్టుకట్టి చేసిన డెవిల్ కూడా సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తుందనే నమ్మకం సంయుక్తలో కనిపిస్తోంది. ఇద్దరు ముగ్గురు తప్ప హీరోయిన్ల పరంగా పెద్దగా ఛాయస్ లేకుండా పోతున్న టైంలో సంయుక్త కూడా ఇలా స్టార్ హీరోలతో జట్టు కట్టేస్తే మీడియం రేంజ్ నిర్మాతలకు మళ్ళీ ఇబ్బందులు తప్పవేమో.
This post was last modified on May 2, 2023 2:52 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…