The Kerala Story
ఎంత కాంట్రావర్సీకి అంత పబ్లిసిటీ అన్నట్టు ఉంటుంది కొన్ని సినిమాల వ్యవహారం. కేరళలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ ఈ వారమే విడుదల కాబోతోంది. గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఏవైతే పరిస్థితులు తలెత్తాయో అచ్చం అవే రిపీటవుతున్నాయి. ట్రైలర్ వచ్చాక రాజకీయంగా సైతం దీని మీద సమర్ధన, వ్యతిరేకత మొదలైంది. ముగ్గురు ఇతర మతస్థులైన మహిళలు ముస్లింలను పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా ప్రభావితం చెంది పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరారనే పాయింట్ మీద ఈ నేపధ్యాన్ని అల్లుకున్నారు.
సెన్సార్ బోర్డు దీనికి చాలా కట్స్ మ్యూట్స్ ఇచ్చింది. శత్రుదేశంని ఉద్దేశించి పెట్టిన డైలాగులు, మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న సన్నివేశాలు అన్నింటికి కోత పెట్టింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇది పెద్ద తలనెప్పిగా మారడంతో ఏకంగా బ్యాన్ చేయాలని పిలుపు నివ్వడం మరో మలుపుకు దారి తీసింది. డిస్ట్రిబ్యూటర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్రిస్టియన్ వర్గం అధికంగా ఉండే ఆ రాష్ట్రంలో తర్వాత గణనీయమైన జనాభా ముస్లింలదే. అందుకే ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందోనన్న ఉద్దేశంతో రిలీజ్ నే ఆపాలని చూస్తోంది
అనధికార లెక్కల ప్రకారం కేరళలో ముప్పై ఐదు వేలకు పైగానే అమ్మాయిలు మహిళలు ఇలా మతమార్పిడిలో టెర్రరిజం వైపు ఆకర్షితులయ్యారని ఒక రిపోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ సినిమాకు నిషేధించాలంటూ నినదిస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం దాకా షోలు పడతాయనే గ్యారెంటీ లేదని బయ్యర్లు అనుమానపడుతున్నారు. అందుకే పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. సుదిప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ రియల్ డ్రామాని తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశారు
This post was last modified on May 2, 2023 7:08 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…