ఆ డైరెక్టర్ తిప్పలు వర్ణనాతీతం!

మణిరత్నం లాంటి దర్శకుడు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ సమస్య గురించి మాట్లాడితే వెంటనే అందరూ స్పందిస్తారు. హీరోలంతా ఆయన వెనక నిలబడతారు. గొప్ప ఫిలిం మేకర్ గా ఆయన తన గౌరవం అలా నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు మణిరత్నంతో సమానంగా మాట్లాడుకున్న వర్మ చేజేతులా తన గౌరవం పోగొట్టుకున్నాడు. బుర్ర, బుద్ధి లేని అడోలసేంట్ కుర్రాళ్లను ఆకట్టుకోడానికి వర్మ నా ఇష్టం వచ్చినట్టుంటా అనే మాటలు మొదలు పెట్టాడు.

తర్వాత ఇష్టానికి సినిమాలు తీస్తూ, వ్యక్తులపై బురద జల్లుతూ తన ప్రతిష్ట మంటగలుపుకున్నాడు. బాలీవుడ్ మొత్తం తలెత్తి చూసిన చోట ఇప్పుడు వర్మకు చోటు లేదు. సుశాంత్ సింగ్ చావుని అందరూ తలా ఒక రకంగా వాడేసుకుంటూ వుంటే… అదే అడ్డం పెట్టుకుని బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించడానికి వర్మ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అర్నాబ్ గోస్వామిపై సినిమా తీస్తానంటూ హల్చల్ చేస్తున్నాడు.

అటెన్షన్ కోసం టాలీవుడ్ లో వర్మ ఏమి చేస్తున్నాడనేది తెలిసిందే. కానీ ఇక్కడ తనను ఎవరూ దేఖట్లేదు. ఈ విధంగా బాలీవుడ్ తరఫున వకాల్తా తీసుకుని అర్నాబ్ పై అటాక్ చేస్తే అయినా అక్కడి వాళ్ళు పట్టించుకుంటారని ఆశ కాబోలు.