అనుష్కను తెరమీద చూసి చాలా కాలమవుతోంది. భాగమతి తర్వాత మళ్ళీ నిశ్శబ్దం ద్వారా ఓటిటిలో చూసుకోవాల్సి వచ్చింది తప్ప ఇంకే హీరో పక్కన దర్శనం కలిగే భాగ్యం అభిమానులకు దక్కలేదు. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న నవీన్ పోలిశెట్టి ఇందులో హీరోగా నటించడం ప్రధాన ఆకర్షణ కానుండగా భారీ బడ్జెట్ లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన యువి క్రియేషన్స్ ఈ కూల్ ఎంటర్ టైనర్ నిర్మించడం మరో విశేషం.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన టైంలో అనుష్క నవీన్ ల జంట ఎలా కనిపిస్తుందోననే అనుమానం లేకపోలేదు. అయితే దర్శకుడు మహేష్ బాబు వాటికి చెక్ పెడుతూ చక్కగా ప్రెజెంట్ చేశారు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే ఒక లేడీ చెఫ్, నవ్విస్తూ జీవితం గడపాలనుకుంటూ స్టాండ్ అప్ కమెడియన్ గా అంతంతమాత్రం ఆదాయంతో నెట్టుకుంటూ వచ్చే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి మధ్య ఏర్పడే పరిచయం ఆ తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా కథ నడుస్తుంది. అయితే ఇది ప్రేమ పెళ్లిగా మారుతుందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది తెరమీద చూస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.
అనుష్క బొద్దుగా ఉంది. మరీ సన్నబడిన దాఖలాలైతే లేవు కానీ ముద్దుగుమ్మ ఎలా ఉన్నా అందమే తరహాలో స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చేలానే ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ఇంతకు ముందు మే మూడో వారంలో విడుదల ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ టీజర్ లో మాత్రం కమింగ్ సూన్ అని ఇచ్చారు. అంటే మార్పు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రధన్ సంగీతం సమకూర్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నీరవ్ షా ఛాయాగ్రహణం అందించారు. ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న అనుష్క ఇకనైనా వరసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.
This post was last modified on April 30, 2023 2:17 pm
ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ…
కంచే గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా…
పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య…
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…