సినిమా నిర్మాణం దర్శకత్వానికి హానికరం

ఎవరు ఏ పని చేయాలో దానికే పరిమితమవ్వాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా రంగానికీ వర్తిస్తుంది. ఒకప్పుడు దాసరి, ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు నాలుగైదు శాఖలు ఒకేసారి నిర్వహించి బ్లాక్ బస్టర్లు కొట్టేవాళ్ళు. అప్పటి పరిస్థితులు వేరు. ప్రత్యేకంగా కథలు స్క్రిప్టులు మాటలు రాసే రచయితలు విడిగా ఉండేవారు. ఆ కారణంగానే పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్టార్ స్టేటస్ అనుభవించారు. ఇప్పుడు కొత్త జనరేషన్ లో డైరెక్టర్లందరూ ప్రొడక్షన్ తో సహా అన్నింట్లోనూ తమ హ్యాండ్ ఉండాలనే తాపత్రయం కొంపముంచేస్తోంది. ముఖ్యంగా నిర్మాణం విషయంలో అతిగా ఇన్వాల్వ్ కావడం ద్వారా

దిల్ రాజు పాతికేళ్ల కెరీర్ లోనే పెద్ద ఝలక్ ఇచ్చిందని చెప్పుకున్న శాకుంతలంలో అధిక శాతం పెట్టుబడి గుణశేఖర్ దే. ఆయన స్వంత బ్యానర్ మీద సగమయ్యాక రాజుగారిని పార్ట్ నర్ గా తీసుకున్నారు. ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తేలడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. తాజాగా ఏజెంట్ కు ఇదే జరుగుతోంది. అనిల్ సుంకరతో పాటు సురేందర్ రెడ్డి ఇందులో నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ చూస్తుంటే ఇదీ అదే బాటలో వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. పూరి జగన్నాధ్ లైగర్ ప్రొడక్షన్ లో తీసుకున్న ఓవర్ ఇన్వాల్ మెంట్ స్క్రిప్ట్ ని దెబ్బ కొట్టింది.

ఆచార్య తాలూకు సెటిల్ మెంట్ల కోసం కొరటాల శివ కొత్త స్క్రిప్ట్ పక్కన పెట్టి నెలల తరబడి విలువైన సమయాన్ని పోగొట్టుకోవడం ఎవరూ మర్చిపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి కానీ ప్రొడ్యూసర్ ఇచ్చే రెమ్యునరేషన్ కంటే భాగస్వామ్యం కావడం ద్వారానో లేదా ఏరియాల వారిగా హక్కులు కొనేసుకోవడం ద్వారానో ఎక్కువ డబ్బు వస్తుందనే లెక్క చాలా మంది విషయంలో రివర్స్ అవుతోంది. అందుకే అనిల్ రావిపూడి, బోయపాటి శీను లాంటి వాళ్ళు ఇలాంటి రిస్కులకు దూరంగా ఉంటూ చక్కగా బ్లాక్ బస్టర్ల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇదే ఉత్తమం కూడా