గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై తమిళంలో ఆ అంచనాల మేర విజయాన్ని అందుకుంది మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం నిరాశ పరిచింది. మన ప్రేక్షకులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. కథాకథనాలు.. యాక్షన్ ఘట్టాలు బాహుబలి తరహలో ఊహించుకున్న మన ప్రేక్షకులు నిరాశ చెందారు. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో కొన్ని ఆకర్షణలున్నాయి. ముఖ్యంగా ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్-2కు కూడా ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఐతే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకుంది… ప్రేక్షకులను కట్టి పడేసింది మాత్రం కార్తీ-త్రిషల జోడీనే అని చెప్పాలి.
పొన్నియన్ సెల్వన్-2లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విక్రమ్ ఉన్నాడు. ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఉంది. ఇంకా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించి ప్రేక్షకులను ఎక్కువ మెప్పిస్తోంది కార్తీ, త్రిషలే. కార్తీ మామూలుగానే తెరపై కనిపిస్తే హుషారు వస్తుంది. ఈ సినిమాలో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. తన చలాకీ నటనతో ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు.
ఇక వయసు పెరిగే కొద్దీ త్రిషలో అందం, ఆకర్షణ పెరిగిపోతుండటం విశేషం. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ చూపు తిప్పుకోవడం కష్టం. కెరీర్ ఆరంభంలో కూడా ఇంత అందంగా లేదు అనిపించేలా ఈ సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిందామె. ఇక కార్తీ-త్రిషల కలయికలో ఒక నీటి మడుగు మధ్యలో వచ్చే ఒక సీన్ వారెవా అనిపిస్తుందంతే. సినిమాలో స్టాండౌట్‌గా నిలిచిన సన్నివేశం అది. సినిమాలోని మహా మహా నటీనటులను డామినేట్ చేస్తూ కార్తీ-త్రిష హైలైట్ అవ్వడం పెద్ద విషయమే.
This post was last modified on April 29, 2023 6:27 am
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…