Movie News

నితిన్, శర్వా మిస్సయ్యారా.. సేఫ్ అయ్యారా?

యువ కథానాయకుడు నితిన్ తన సొంత బేనర్ శ్రేష్ట్ మూవీస్‌లో ఒక ప్రతిష్టాత్మక చిత్రం చేయడానికి కొన్నేళ్ల ముందు పెద్ద కసరత్తే చేశాడు. లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయాలనుకున్న ఆ సినిమానే.. ‘పవర్ పేట’. తమిళంలో వెట్రిమారన్ తీసిన ‘వడ చెన్నై’ తరహాలోనే ఆంధ్రా ప్రాంతంలో రౌడీలకు పెట్టింది పేరైన పవర్ పేట నేపథ్యంలో రా అండ్ రస్టిక్‌గా ఒక రౌడీ కథను తీయాలన్నది కృష్ణచైతన్య ఆలోచన. ఈ సినిమాను రెండు మూడు భాగాలుగా తీయడానికి ప్రణాళికలు రచించారు.

ఈ సినిమాలో తాను రకరకాల వయసుల్లో, డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తానని.. తన కెరీర్లో ఇంత దాకా పడని కష్టం, పెట్టని ఖర్చు ఈ సినిమాకు ఉంటుందని నితిన్ తెలిపాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకున్న దశలో ఆశ్చర్యకరంగా నితిన్ వెనక్కి తగ్గాడు. సినిమా అటకెక్కేసింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న కృష్ణచైతన్య మళ్లీ ఇదే కథను శర్వానంద్‌తో తీయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రాజెక్టుకు కూడా అనౌనన్స్‌మెంట్ తర్వాత బ్రేక్ పడింది.

ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గాక ఇక ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా కృష్ణ చైతన్య మరో ప్రయత్నం చేశాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్‌ను మెప్పించి, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌ను ఒప్పించి ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టాడు. గురువారమే ఈ సినిమా ముహూర్త వేడుక జరుపుకుంది. ఈ సినిమాలో కనిపించబోయే రగ్డ్ లుక్‌లోనే ముహూర్త వేడుకకు హాజరయ్యాడు విశ్వక్.

ఈ చిత్రంలో విశ్వక్ కంటే పెద్ద వయసున్న అంజలి అతడికి జోడీగా నటించబోతోంది. ఇద్దరు పేరున్న హీరోలతో మొదలైనట్లే మొదలై ఆగిపోయిన సినిమాను సితార వాళ్లు ముందుకు తీసుకెళ్తుండటం, పెద్ద బడ్జెట్లో సినిమాను నిర్మించబోతుండటం విశేషమే. సితార లాంటి సంస్థ అండ దొరికిందంటే ఇక ఈ ప్రాజెక్టుకు ఏ అడ్డంకీ లేనట్లే. మరి కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని మిస్ అయినందుకు నితిన్, శర్వానంద్‌ ఫీలయ్యేలా చేస్తాడా.. లేక సేఫ్ అయ్యాం అనుకునేలా చేస్తాడా అన్నది ఆసక్తికరం.

This post was last modified on April 27, 2023 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

16 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

6 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

9 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

11 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago