హీరోగా ఇప్పటిదాకా అక్కినేని అఖిల్ కోరుకున్న సక్సెస్ రాలేదు. కానీ అతడి సినిమాలకు క్రేజ్ అయితే తక్కువేమీ కాదు. తొలి చిత్రం ‘అఖిల్’ రిలీజ్‌కు ముందు యుఫోరియా గురించి అక్కినేని అభిమానులను అడిగితే కథలు కథలుగా చెబుతారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి సినిమాకు కూడా ఇంత హంగామా లేదంటే అతిశయోక్తి కాదు.
2015లో ‘అఖిల్’ సినిమా రిలీజైతే.. అప్పట్లోనే ఈ చిత్రం రూ.46 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. సినిమాకు మరీ బ్యాడ్ టాక్ వచ్చింది కానీ.. లేకుంటే బాక్సాఫీస్ మోత మోగేది. అఖిల్ నేరుగా స్టార్ కాదు, సూపర్ స్టార్ అయిపోయేవాడు. అంత బ్యాడ్ టాక్‌తోనూ తొలి రోజు వసూళ్లలో ‘అఖిల్’ రికార్డు నెలకొల్పడం విశేషం. ఇప్పటికీ ఒక డెబ్యూ హీరో సినిమాకు జరిగిన అత్యధిక బిజినెస్ రికార్డు ‘అఖిల్’ పేరిటే ఉంది.
అంతే కాదు.. టైర్-2 హీరోల్లో థియేట్రికల్ హక్కుల ద్వారా అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘అఖిల్’ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఓవరాల్‌గా ఈ జాబితాలో విజయ్ దేవరకొండ మూవీ ‘లైగర్’ రూ.90 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. దసరా (రూ.50 కోట్లు), అఖిల్ (రూ.46 కోట్లు), ది వారియర్ (రూ.40 కోట్లు) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు అఖిల్ కొత్త చిత్రం ‘ఏజెంట్’ రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో ఐదో స్థానానికి చేరుకుంది. అంటే టాప్-5లో రెండు అఖిల్ సినిమాలున్నాయి.
ఐతే తొలి నాలుగు చిత్రాల్లో ఉన్న సినిమాల్లో ఒక్క ‘దసరా’ మాత్రమే టార్గెట్‌ను రీచ్ అయింది. ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ కావడమే కాక.. నైజాం వరకు బ్లాక్‌బస్టర్ అయింది. మరి ‘అఖిల్’తో నిరాశ పరిచిన అఖిల్.. ‘ఏజెంట్’తో బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి కెరీర్లో తొలి పెద్ద హిట్ కొడతాడేమో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది.
This post was last modified on April 27, 2023 3:00 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…