విడుదలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ మహేష్ బాబు 28 పదే పదే వార్తల్లోకి వస్తోంది. అయితే షూటింగ్ కు సంబంధించిన విశేషాలతో కాదు. దేనికీ ఆధారాలు లేని వైరుధ్యమైన ప్రచారాలతో. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. సహజంగా మహేష్ వేసవి సెలవులను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోడు. ఫ్యామిలీకి ఆ సీజన్ ని ఇచ్చేసి విదేశాలకు వెళ్లిపోవడం ముందు నుంచి ఉన్నదే. ఈసారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. కానీ బయట జరుగుతున్న టాక్ ఫ్యాన్స్ లో అయోమయం రేపుతోంది.
వాటి ప్రకారం త్రివిక్రమ్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇప్పటికీ నచ్చలేదని, అందుకే బ్రేక్ ఇచ్చారని, హీరో అడిగిన కరెక్షన్లు చేసి త్వరలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తారని ఏదేదో అంటున్నారు. దీనికి కనెక్ట్ అవుతున్న ఒక బ్యాక్ స్టోరీ ఉంది. త్రివిక్రమ్ వినోదయ సితం రీమేక్ పట్టాలు ఎక్కేదాకా స్క్రిప్ట్ విషయంలో అంతా తానై చూసుకున్నాడు. అంతకు ముందు బీమ్లా నాయక్ కోసం చాలా టైం ఖర్చు పెట్టాడు. వీటివల్లే మహేష్ 28కి అంత బెస్ట్ గా రాయలేకపోయారని కొందరు అభిమానుల ఫీలింగ్. ఇలా మల్టీటాస్కింగ్ చేయడం వల్ల తమ హీరో అవుట్ ఫుట్ క్వాలిటీ తగ్గుతుందని భావిస్తున్నారు
ఇదంతా ఎలా ఉన్నా మహేష్ త్రివిక్రమ్ 2024 సంక్రాంతి డెడ్ లైన్ కి కట్టుబడే ఉన్నారు. మళ్ళీ వాయిదా వేసే ప్రసక్తి ఉండదు. పైగా తీస్తున్నది బాహుబలి ఆర్ఆర్ఆర్ లాగా వంద కోట్ల గ్రాఫిక్స్ మూవీ కాదు. ఖర్చు ఉంటుంది కానీ నీట్ గా అల వైకుంఠపురములో స్టైల్ లో రీజనబుల్ గా తీస్తారని చెప్పడంలో మాత్రం డౌట్ అక్కర్లేదు. కనీసం నవంబర్ కంతా పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేస్తే డిసెంబర్ ని ప్రమోషన్లకు వాడుకోవచ్చు. ఎటొచ్చి చివరి నిముషం హడవిడి లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ట్విట్టర్ లో మహేష్ బాబు 28 ట్రెండింగ్ లోకి రావడం చూస్తే ఫ్యాన్స్ భాదని అర్థం చేసుకోచ్చు.
This post was last modified on April 27, 2023 12:20 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…