దివ్య వడిత్య.. బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి. ఆ షోతో చాలామంది జనం దృష్టిలో పడ్డారు కానీ.. ఆ పాపులారిటీని బాగా వాడుకుని సినిమా అవకాశాలు సంపాదించిన వాళ్లలో దివ్య ముందు వరుసలో ఉంటుంది.
నిజానికి ఆమె అందానికి, ఫిజిక్‌కు తగ్గ రోల్స్ ఇంకా రాలేదు కానీ.. అవకాశాలకు అయితే లోటు లేని స్థితిలో ఉంది. ఈ రోజుల్లో సినిమాల్లో ఎదగాలంటే సోషల్ మీడియా జనాలను ఎంగేజ్ చేస్తూ.. వారిని అందాల మత్తులో ముంచెత్తుతూ ఉండటం చాలా అవసరం. ఈ విషయం ముందు నుంచి దివ్యకు బాగానే తెలుసు.
బిగ్ బాస్ షో నుంచే గ్లామర్ ట్రీట్లు ఇవ్వడం అలవాటు చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన పాలోవర్లను బాగానే ఎంగేజ్ చేస్తుంటుంది. ఆమె ఫొటో షూట్లు చూస్తే స్టార్ హీరోయిన్లకు ఏం తక్కువ ఈ అమ్మాయి అనే అనుమానం కలుగుతుంది. అంత సెక్సీగా కనిపించే ఫిగర్ తన సొంతం.
తాజాగా తన పుట్టిన రోజు నాడు మరోసారి కుర్రాళ్లకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది దివ్య. సముద్ర తీరంలో సాగర కన్యలా తయారై అందాల విందు చేసిందామె. పుట్టిన రోజు నాడు సాగర కన్యలా మారి తనకు తాను ఇచ్చుకున్న ట్రీట్ ఇదని దివ్య పేర్కొంది కానీ.. నిజానికి ఆమె తనను ఫాలో అయ్యే కుర్రాళ్లకే ఇచ్చింది విందు.
కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా దివ్య చాలా వరకు క్యారెక్టర్ రోల్సే చేసింది. గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాలు నటిగా ఆమెకు పేరు తెచ్చాయి. కానీ కెరీర్‌ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లే లీడ్ రోల్స్ కోసం దివ్య చూస్తోంది.
This post was last modified on April 26, 2023 7:30 am
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…