Movie News

ఆ ‘ఖుషి’కి.. ఈ ‘ఖుషి’కి లింక్ ఉంది

ఖుషి సినిమా పేరెత్తితే తెలుగు ప్రేక్షకులకు ఒక పులకింత కలుగుతుంది. ఇది తమిళ చిత్రానికి రీమేకే అయినప్పటికీ.. ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే ఎంతో మరుగ్గా తీర్చిదిద్దడంతో ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్‌ను చేశారు ప్రేక్షకులు. అలాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా పేరును శివ నిర్వాణ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నాడు.

విజయ్ దేవరకొండ, సమంతల కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ చిత్ర బృందం మొండిగా ముందుకు వెళ్లపోయింది. ఈ సినిమాకు వేరే పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ‘ఖుషి’ తరహాలో మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఆ టైటిలే ఖరారు చేసినట్లు శివ కొన్ని రోజుల కిందటే వెల్లడించాడు. ఐతే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఇంకో కారణం కూడా ఉందని.. పాత ‘ఖుషి’తో దీనికి ఇంకో లింక్ కూడా ఉందని చిత్ర వర్గాల సమాచారం.

‘ఖుషి’ సినిమాలో ‘ఇగో’ అనేది చాలా ముఖ్యమైన పాయింట్‌ అనే విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల మధ్య గొడవ మొదలై.. అది చాలా పెద్ద స్థాయికి వెళ్లడానికి.. ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డ జంట అంతకంతకూ దూరం అయిపోవడానికి కారణం ‘ఇగో’నే. ముఖ్యంగా హీరోయిన్‌కు అహం కొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక సీన్లో ఆమె ఇగో గురించి కామెడీ కూడా చేస్తాడు పవన్. కాగా కొత్త ‘ఖుషి’లో కూడా ఇగో అనేది కథను మలుపు తిప్పే పాయింట్‌గా ఉంటుందట. ఇందులో విజయ్, సమంత ముందుగా కలవడానికి.. ఆ తర్వాత విడిపోవడానికి.. ‘ఇగో’నే కారణం అవుతుందట.

ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండానే పీకల్లోతు ప్రేమలో దిగిపోయిన ఈ జంట.. ఇగో క్లాష్ కారణంగా విడిపోవడం.. ఆపై ఇద్దరి మధ్య మరింత దూరం పెరగడం.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఆ జంట కలవడం జరుగుతుందట. కథ వరకు మామూలుగానే అనిపించినా.. కథనం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా ఉంటుందని.. నిన్ను కోరి, మజిలీ తర్వాత శివ మార్కు లవ్ స్టోరీగా ఇది ఉంటుందని.. కచ్చితంగా మంచి ఫలితాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 24, 2023 5:58 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

1 hour ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

2 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

2 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

2 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

3 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

3 hours ago