ఇంకో అయిదే రోజుల్లో ఏజెంట్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అఖిల్ అభిమానులు ఎప్పుడెప్పుడు 28 వస్తుందాని ఎదురు చూస్తున్నారు. అంతగా బజ్ లేని పొన్నియిన్ సెల్వన్ 2 పోటీ పట్ల పెద్దగా ఆందోళన చెందడం లేదు. అయితే మంచి థియేటర్లలో పడితే ఏజెంట్ కి రీచ్ బాగుంటుందన్న అభిప్రాయంతో దానికి తగ్గట్టే ఎక్కడెక్కడ ఏ స్క్రీన్లు ఇస్తున్నారో చూసుకుంటున్నారు. అందులో భాగంగా ముందు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో స్టార్ హీరోలు సెంటిమెంట్ గా భావించే సుదర్శన్ 35 ఎంఎంని చూశారు. అయితే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ వల్ల పీఎస్ 2 కి కేటాయించారు.
ఈలోగా ఏజెంట్ నైజాం బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి చర్చలు జాప్యాలు జరిగిన తర్వాత ఇది కూడా ఆయన చేతికే వచ్చిందని సమాచారం. దీంతో ఇప్పుడు సుదర్శన్ 35 కాస్తా ఏజెంట్ ఖాతాలో చేరింది. ఇదొక్కటే కాదు కూకట్పల్లి భ్రమరాంబ లాంటి కీలక థియేటర్లు అక్కినేని హీరోకి దక్కాయి. ముందు వీటిని పీఎస్ 2కి ఇచ్చినట్టు రెండు రోజుల క్రితమే పేపర్ యాడ్లు వచ్చాయి. గంటల వ్యవధిలో అనూహ్య పరిణామాలు జరిగిపోవడంతో ఏజెంట్ కి ఇదంతా సానుకూలంగా మారింది. వైజాగ్ జగదాంబ లాంటివి మిస్ అయినా అధిక శాతం క్వాలిటీ స్క్రీన్లు వచ్చేలా చూసుకున్నారు
ఫైనల్ గా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలకు రికవరబుల్ పద్ధతిలో చేసారు కాబట్టి ఫిగర్లు అంత సులభంగా బయట పడకపోవచ్చు. వరంగల్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని మరో టాక్ ఉంది. ప్రభాస్ ఎలాగూ మిస్ అయ్యాడు కాబట్టి రామ్ చరణ్ ని తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. కంటెంట్ మీద అఖిల్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. పది నెలల శారీరక కష్టం మూడు సంవత్సరాల నిర్మాణం వెరసి బ్లాక్ బస్టర్ కు తక్కువ కాని ఫలితాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు
This post was last modified on April 23, 2023 4:20 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…