సినీ రంగంలో సెంటిమెంట్లు చాలా చాలా ఎక్కువ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ కావడం వల్ల సెంటిమెంట్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. నెగెటివ్ సెంటిమెంట్ల విషయంలో భయపడి ఎలా వెనుకడుగు వేస్తారో.. పాజిటివ్ సెంటిమెంట్లను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు కూడా.
ఇప్పుడు ఏజెంట్ సినిమా టీం కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్ మీద నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్లో అఖిల్ మెషీన్ గన్ను పట్టుకుని వీర విధ్వంసం చేసిన షాట్ మాస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కథలో భాగంగానే అఖిల్ ఈ విన్యాసం చేసి ఉండొచ్చు కానీ.. జనాలకు మాత్రం ఆ షాట్ చూడగానే వేరే సినిమాలను గుర్తు తెచ్చుకుంటున్నారు.
హీరో ఇలా మెషీన్ గన్నుతో విధ్వంసం సృష్టించిన సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లు అవుతుండటంతో అదొక సెంటిమెంటుగా మారిపోయింది. గత కొన్నేళ్లలో మొదటగా హీరో ఇలా కనిపించింది ఖైదీలో. అందులో సినిమా చివర్లో కార్తి పోలీస్ స్టేషన్లో మెషీన్ గన్నుతో విలన్ల ఆట కట్టిస్తాడు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ సైతం ఇలాంటి విన్యాసమే చేశాడు.
అందులో ఆయన పాత కాలం నాటి నాటు మెషీన్ గన్ వాడాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఇక కేజీఎఫ్-2లో రాకీ భాయ్ మెషీన్ గన్ విన్యాసం టీజర్ దశ నుంచే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచింది. ఆ సినిమా మెగా బ్లాక్‌బస్టర్ అయింది. చివరగా వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సైతం ఇదే విన్యాసంతో మెప్పించాడు. సినిమా ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అఖిల్ కూడా మెషీన్ గన్ను పట్టుకుని బాక్సాఫీస్ విధ్వంసానికి తెర తీస్తాడేమో చూడాలి.
This post was last modified on April 21, 2023 2:27 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…