సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన తల్లిదండ్రులతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన తండ్రి కృష్ణ పేరెత్తితే చాలు చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు మహేష్. అలాగే తల్లి ఇందిరాదేవి విషయంలోనూ ఇంతే ఎమోషన్ చూపిస్తుంటాడు. మహేష్ అంతగా ప్రేమించే ఆ ఇద్దరూ ఒకే ఏడాది కొన్ని నెలల వ్యవధిలో కన్నుమూయడం మహేష్‌కు తీరని లోటే. గత ఏడాది ముందుగా ఇందిర, తర్వాత కృష్ణ కొన్ని నెలల వ్యవధిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
మరణానంతరం ఇందిర తొలి జయంతి ఈ రోజే. ఈ సందర్భంగా మహేష్ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్ డే అమ్మా.. నీకు ప్రతి రోజూ రుణపడి ఉంటాను’’ అంటూ హృద్యమైన పోస్టు పెట్టాడు మహేష్. రెగ్యులర్ పోస్టే అయినప్పటికీ ఇది వైరల్ అయిపోయింది.
మహేష్ తల్లి పుట్టిన రోజు నాడే.. ‘ఖలేజా’ సినిమాలో ఆయనకు జోడీగా నటించిన అగ్ర కథానాయిక అనుష్క తండ్రి బర్త్ డే కావడం విశేషం. అనుష్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చాలా చాలా తక్కువ. అలాంటిది తన తండ్రి మీద తనతో పాటు కుటుంబమంతా ప్రేమను కురిపిస్తూ ఒక అందమైన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి.. ‘‘హ్యాపీయెస్ట్ బర్త్ డే పాపలు’’ అని వ్యాఖ్య కూడా జోడించింది. ఈ పోస్టును బట్టి తన తండ్రిని అనుష్క ‘పాపా’ అని పిలుచుకుంటుందని అర్థమవుతోంది.
ఒకప్పటితో పోలిస్తే అనుష్క సినిమాలు బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. గత ఏడాదే అనుష్క.. నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక సినిమాను మొదలుపెట్టింది. దానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 20, 2023 4:02 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…