కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలకు క్లీన్ యు, పెద్దల పర్యవేక్షణలో పిల్లలు కూడా చూడదగ్గట్లుగాఉంటే యు/ఎ, పెద్దలు మాత్రమే చూడదగ్గట్లుగా కొంచెం బోల్డ్, వయొలెంట్ ఉంటే ఎ.. ఇదీ దశాబ్దాలుగా సినిమాలకు సెన్సార్ బోర్డు ఇస్తున్న రేటింగ్స్. ఐతే త్వరలో ఈ విధానం మారతోబోతోంది. ఇప్పుడున్న పద్ధతిని ఎలా మార్చబోతున్నారు.. కొత్త విధానం ఎలా ఉండబోతోంది అన్నది తెలియదు కానీ మార్పు అయితే జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న సినిమాటోగ్రఫీ చట్టం 2023లో విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నాయట.
ఇందులోప్రస్తుం సెన్సార్ బోర్డు అనుసరిస్తున్న U,A, U/A వర్గీకరణ విధానాన్ని కూడా మార్చబోతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. సెన్సార్ బోర్డు సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే విధానంపై ఎప్పట్నుంచో విమర్శలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సెన్సారింగ్ ఉండట్లేదని.. దశాబ్దాల కిందటి విధానాన్ని అనుసరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
మరి కొత్త సెన్సారింగ్ ఎలా ఉండబోతోందో చూడాలి. ఇదిలా ఉండగా.. సినిమా పైరసీని అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇంటర్నెట్లో పైరేటెడ్ కంటెంట్‌ను అడ్డుకునే దిశగా ఈ బిల్లులో కీలక చట్టం తీసుకురానున్నారట. పరిశ్రమ కోరరుకున్నవన్నీ ఈ బిల్లులో ఉన్నాయని.. వారి అంచనాలకు తగ్గట్లు.. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బిల్లును రూపొందించామని.. సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాలకు దగ్గరగా బిల్లు ఉంటుందని టాకూర్ తెలిపారు. తదుపరి సమావేశంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
This post was last modified on April 20, 2023 9:20 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…