తన సంస్థలో పెద్ద సినిమాలు నిర్మిస్తూ తాజాగా మరో చిన్న బేనర్ స్టార్ట్ చేశారు దిల్ రాజు. ‘డీ ఆర్ పీ’ అనే సంస్థను మొదలు పెట్టి ఆ భాద్యతలు తన కూతురు హన్షిత , అన్న కొడుకు హర్షిత్ లకు అప్పగించాడు. ఈ బేనర్ లో వచ్చిన మొదటి సినిమా ‘బలగం’ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుంది. గొప్ప పేరుతో పాటు డబ్బు కూడా తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా రెడీ అయింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారు. డాన్స్ మాస్టర్ యశ్ ను హీరోగా, శశి అనే రైటర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. రోడ్ జర్నీ తో సాగే ఎంటర్టైనింగ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఓ మంచి డేట్ లాక్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
అయితే బలగం దారిలోనే ఈ సినిమాను కూడా ముందు నుండి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ముందుగా తన కొత్త బేనర్ కి బ్రాండ్ గా నిలిచిన బలగంను వాడుకొని ఆ సినిమాకు ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ బలగం అనే ట్యాగ్ వేయనున్నారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు , వరుస ప్రెస్ మీట్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అన్నీ బలగంలా అద్భుతాలు చేస్తాయనుకోలేం. మరి దిల్ రాజు వారసులకు ఈ రెండో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on April 18, 2023 10:07 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…