Movie News

మూడు నెలల్లో నాలుగో సినిమా షూటింగ్

మూడు దశాబ్దాలకు చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నది లేదు. ఒక సినిమా అయ్యాక చాలా గ్యాప్ తీసుకుని ఇంకో సినిమా చేసేవాడాయన. అలాంటిది మూడు నెలల వ్యవధిలో నాలుగో సినిమా చిత్రీకరణలో పాల్గొనడం.. ఒకే సమయంలో ఆయన సినిమాలు నాలుగు వివిధ దశల్లో ఉండటం అన్నది ఊహకైనా అందని విషయమే.

చాన్నాళ్ల పాటు షూటింగ్ ఆగిపోయి ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను గత ఏడాది చివర్లో తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లాడు పవన్. కొన్ని వారాల పాటు విరామం లేకుండా ఈ సినిమా షూట్‌లో పాల్గొని భారీ యాక్షన్ ఎపిసోడ్లన్నింటినీ పూర్తి చేశాడు. ఇక ఫిబ్రవరి నెలాఖర్లో ‘వినోదియ సిత్తం’ రీమేక్‌ను పవన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో తన పనంతా పూర్తి చేసి.. కొన్ని వారాల కిందటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

అందులో ఒక షెడ్యూల్ అయింది. ఇప్పుడేమో సుజీత్ డైరెక్షన్లో ‘ఓజీ’కి కూడా డేట్లు ఇచ్చేశాడు పవన్. మిగతా సినిమాలన్నీ కూడా చాన్నాళ్ల నుంచి వెయిటింగ్‌లో ఉన్నవి. కానీ ‘ఓజీ’ అనౌన్స్ చేసింది చాలా లేటుగా. ఒకేసారి ఇన్ని సినిమాల చిత్రీకరణ అంటే చాలా కష్టం కాబట్టి.. ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తాడేమో, ఎన్నికల తర్వాత చూసుకుంటాడేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ వాళ్లకు షాకిస్తూ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టించేశాడు పవన్.

పవర్ స్టార్ షూట్‌కు హాజరవుతున్న విషయాన్ని వెల్లడిస్తూ.. ‘ఫైర్ స్టార్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఒక పోస్టు పెట్టింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తున్న సినిమా కావడంతో వారి ఆనందం మామూలుగా లేదు. ఈ సినిమా షెడ్యూల్ ఒకటయ్యాక తిరిగి హరీష్ శంకర్ సినిమాలోకి వెళ్లనున్నాడు పవన్. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగే ముందు మూణ్నాలుగు నెలల్లో ఈ రెండు సినిమాలనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. కానీ ముందస్తు ఎన్నికలంటే మాత్రం ఈ సినిమాలు రెండూ పెండింగ్‌లో పడిపోవడం ఖాయం.

This post was last modified on April 18, 2023 2:11 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

3 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

6 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

8 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

10 hours ago