ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవడ అంటే చిన్న విషయం కాదు. కిరణ్ అబ్బవరం అనే కుర్రాడు ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనూ యూత్‌లో కొంత ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి చిన్న సినిమాతో అతను రాబట్టిన ఓపెనింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. ఆ సినిమా డివైడ్ టాక్‌ను తట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ ఊపు చూసి పేరున్న బేనర్లలో కిరణ్‌కు అవకాశాలు వచ్చాయి. అతడితో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు ఆసక్తి చూపించారు.
గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బేనర్లలో అవకాశం దక్కడం అంటే చిన్న విషయం కాదు. కిరణ్‌కు దక్కిన ఆ అదృష్టం చూసి వేరే యంగ్ హీరోలు కుళ్లుకునే పరిస్థితి కనిపించింది. ఒక టైంలో కిరణ్ కొత్త సినిమాలకు డేట్లు సర్దుబాటు చేయలేని స్థితిలో ఉన్నాడు.
కానీ ఎంత వేగంగా ఫాలోయింగ్ సంపాదించాడో అంతే వేగంగా దాన్ని కోల్పోవడంతో ఇప్పుడు కిరణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గీతా బేనర్లో తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథకు కూడా అంత మంచి టాక్ రాకపోయినా అది బ్యాడ్ మూవీ అయితే కాదు. పైగా గీతా వారి మార్కెటింగ్ నైపుణ్యంతో అది బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా ఆడేసింది. కానీ మైత్రీ లాంటి పెద్ద బేనర్లో కిరణ్ చేసిన మీటర్ దారుణంగా బోల్తా కొట్టడంతో కిరణ్ మీద ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు. ఈ దెబ్బతో ఇండస్ట్రీలో కిరణ్ మీద ఒపీనియనే మారిపోయింది.
ఇప్పటిదాకా తన కోసం వెంటపడ్డ నిర్మాతలు ఇప్పుడు సైడైపోతున్నారు. అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అంతా దెబ్బ తినేసిన పరిస్థితి కనిపిస్తుండటంతో ఇక కొత్త సినిమాలు రావడం కష్టం లాగే ఉంది. రూల్స్ రంజన్ సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా ఆడితే కిరణ్ కెరీర్ పుంజుకుంటుందేమో కానీ.. అది తేడా కొడితే మాత్రం చాలా కష్టమే.
This post was last modified on April 17, 2023 6:17 am
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…