పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఓవర్ డోస్ ఎగ్జైట్మెంట్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాతికేళ్లకు పైగా సాగిన కెరీర్లో పవన్ ఎన్నడూ చూపించని వేగం ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా సరే.. పవన్ ఒకేసారి సమాంతంగా రెండు సినిమాల్లో నటించింది లేదు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు చాలా గ్యాప్ తీసుకునేవాడు. రెండేళ్లకు ఒక సినిమా రావడం కూడా గగనంగా ఉండేది.
మిగతా స్టార్ హీరోలు గ్యాప్ లేకుండా నటిస్తుంటే.. పవన్ మాత్రం తాపీగా సినిమాలు చేయడం వారికి రుచించేది కాదు. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చాక పవన్ మరింత స్పీడు తగ్గించేశాడు. ఒక దశలో సినిమాలకు దూరం కూడా అయ్యాడు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చాక కూడా కొంచెం నెమ్మదిగానే కనిపించాడు. కానీ ఈ మధ్య మాత్రం ఉన్నట్లుండి స్పీడు పెంచేశాడు. ఆ స్పీడు సూపర్ ఫాస్ట్ రేంజిలో ఉండటమే అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోతుండటానికి కారణం.
ఓవైపు చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కొన్ని వారాల పాటు విరామం లేకుండా షూటింగ్‌కు హాజరై ముఖ్యమైన ఎపిసోడ్లు పూర్తి చేశాడు. తర్వాత కేవలం 20 రోజులు డేట్లు ఇచ్చి ‘వినోదియ సిత్తం’ రీమేక్‌లో తన పని మొత్తం అవగొట్టేశాడు. ఆ వెంటనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పట్టాలెక్కించాడు. తొలి షెడ్యూల్ ఏ ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చేశాడు. ఇంతలోనే సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ని మొదలుపెట్టేశాడు. హరీష్ శంకర్ అనగానే పవన్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అతడితో మళ్లీ సినిమాను మొదలు పెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేయడం అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది.
హరీష్ లాగే పవన్ అభిమానే అయిన సుజీత్ తీసే సినిమా విషయంలోనూ అభిమానులు చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచేలా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమోతో సుజీత్ తన మార్కు చూపించాడు. ఇలా వరుసబెట్టి అప్‌డేట్లను, ఈ ఆనందాన్ని పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి.
This post was last modified on April 17, 2023 6:15 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…