నిన్న విడుదలైన శాకుంతలం మీద పూర్తిగా నెగటివ్ టాక్ నడుస్తోంది. త్రీడి హంగులు జోడించినా, నిర్మాతలు ప్రమోషన్ల హంగామా ఎంత చేసినా, నాలుగు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవలే హీరోయిన్ సమంత మీద సీనియర్ నటుడు కం నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చైతుతో విడాకులు అయ్యాక పుష్పలో ఐటెం సాంగ్ చేయడం కేవలం సంపాదన కోసమే అన్న ఆయన ఆమెకు హీరోయిన్ స్థాయి పడిపోవడం వల్లే ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకుని చేస్తోందని వ్యాఖ్యానించారు.
గతాన్ని వాడుకుని సానుభూతిని రాబట్టుకోవాలని చూస్తున్న సామ్ యశోద విడుదల సమయంలో ఇదే ఎత్తుగడ పాటించి హిట్టు కొట్టాలని చూసిందన్నారు. శాకుంతలం నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ తాను చనిపోయేలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పడం కేవలం సింపతీని కోరుకునే ప్రయత్నమని, ప్రతిసారి ఇలా ప్రేక్షకులను సెంటిమెంట్ తో టచ్ చేయాలని చూస్తే వర్కౌట్ కాదని, ఇదంతా డ్రామాని కొట్టిపారేస్తూ తేల్చి చెప్పడం షాకిచ్చే విషయం. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే అయినప్పటికీ యశోద, శాకుంతలం ప్రీరిలీజ్ టైంలో పరిణామాలను నెటిజెన్ల లింక్ చేసి చూస్తున్నారు.
సరిగ్గా రిలీజ్ కు రెండు రోజులు ఉండగా జ్వరంతో ఈవెంట్లకు దూరమవుతున్నానని సమంతా ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి చిట్టిబాబు మాటలు చిన్నపాటి దుమారమే రేపాయి. శాకుంతలం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్ కు ఫలితం షాకిచ్చేలా ఉంది. అన్ని భాషల్లోనూ ఒకే స్పందన వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఓపెనింగ్ ఫిగర్స్ భయపెట్టేలా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఇది హిట్టయ్యుంటే ఎలా ఉండేదో కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ పరిణామాల పట్ల సామ్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.
This post was last modified on April 15, 2023 10:58 am
సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…