కెజిఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏదనే ఆసక్తి కన్నడ ప్రేక్షకుల్లోనే కాదు ఇతర రాష్ట్రాల ఆడియన్స్ లోనూ ఉంది. రాఖీ భాయ్ ఎలాంటి కథలో కనిపిస్తాడోనని ఎదురు చూస్తున్నారు. ఏడాది గడిచినా ఇంకా కొత్త ప్రాజెక్టుని లాక్ చేయకపోవడం పట్ల పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా మలయాళం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.
గీతూ మోహన్ దాస్ ప్రత్యేకత ఏంటనేగా మీ డౌట్. ఆవిడ అసలు పేరు గాయత్రి దాస్. మల్లువుడ్ లో ప్రముఖ నటి. 1986లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మొదటి చిత్రం ఒన్ను ముత్తల్ పూజయం వరేతో కేరళ స్టేట్ అవార్డు కొట్టేసింది. హీరోయిన్ గా చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. 2009లో స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి చిన్న షార్ట్ ఫిలిం ఒకటి తీస్తే అది ఏకంగా మూడు ఇంటర్నేషనల్ పురస్కారాలు తీసుకొచ్చింది. 12వ తరగతి పాఠ్య పుస్తకంలో ఈ మూవీని ఒక లెసన్ గా పొందుపరిచారు. 2014లో లయర్స్ డైస్ అనే హిందీ చిత్రాన్ని పూర్తి స్థాయి నిడివితో చేస్తే దానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. 2019లో తీసిన మూతోన్ పెద్ద విజయం సాధించింది. దీని తెలుగు డబ్ ఓటిటిలో ఉంది.
వినడానికి అనుభవం తక్కువగా అనిపించినా అంతర్జాతీయ స్థాయిలో గీతూ మోహన్ దాస్ సాధించిన ఘనతలు చాలా పెద్దవి. అయితే సంవత్సరం పైగా కాలం ఆవిడతో పాటు యష్ కథకు సంబందించిన తీవ్ర చర్చల్లో ఉన్నారట. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా అనిపించాక అనౌన్స్ మెంట్ ఇచ్చే ప్లానింగ్ తో ఉన్నారు. ఎందరో స్టార్ డైరెక్టర్లు వెంట పడగా నో చెప్పిన యష్ ఇలా మహిళా దర్శకురాలితో చేసేందుకు సానుకూలంగా ఉండటం ఆశ్చర్యమే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా మొదలుపెట్టమని ఫ్యాన్స్ డిమాండ్.
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…