పవన్ నిర్మాతల మధ్య అయోమయం

ఎప్పుడూ లేనిది ఒకేసారి నాలుగు సినిమాలు సెట్ల మీదకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టే వాటిని వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు వచ్చే ఏడాది రాబోతున్న నేపథ్యంలో జనసేన కార్యకలాపాల పరంగా చాలా ఒత్తిడి రాబోతోంది. అందుకే దసరా లేదా దీపావళికంతా వీటి షూటింగులకు గుమ్మడికాయ కొట్టేసి బ్రేక్ తీసుకునే ప్లానింగ్ లో ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ విడుదల తేదీలకు సంబంధించి నిర్మాతల మధ్య బోలెడు కన్ఫ్యూజన్ నెలకొంటోందని ఇన్ సైడ్ టాక్. జూన్ లో రాబోతున్న వినోదయ సితం రీమేక్ తప్ప దేనికీ రిలీజ్ డేట్లు ఫిక్స్ కాలేదు.

హరిహరవీరమల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే తీసుకురావాలని నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతికి వెళ్లి రిస్క్ చేయడం కన్నా సోలోగా వస్తే ప్యాన్ ఇండియా మార్కెట్ ని వాడుకోవచ్చని వాళ్ళ ఆలోచన. ఇంకొంత భాగం బ్యాలన్స్ ఉంది కానీ ఎంత శాతమనేది బయటికి చెప్పడం లేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ జనవరికి ట్రై చేస్తామని హరీష్ శంకర్ చెబుతున్నారు కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యమనేది ఇప్పుడే నిర్ధారించలేం. ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) ప్రీ ప్రొడక్షన్ ఆఘమేఘాల మీద జరుగుతోంది కానీ దీని చుట్టూ ఎన్నో సమీకరణాలున్నాయి..

బిజినెస్ ఎంక్వయిరీలు జరుగుతున్న తరుణంలో డెడ్ లైన్ ఉంటే తప్ప బయ్యర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇవి చాలవన్నట్టు పవన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే టాక్ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి కాంబోలో అనేది బయటికి చెప్పలేదు కానీ ప్రస్తుతానికి చర్చలైతే జరుగుతున్నాయి.

పొలిటికల్ గా పవన్ ఎప్పుడు బిజీ అవుతాడోననే టెన్షన్ అన్ని యూనిట్లలోనూ ఉంది. హఠాత్తుగా మారిపోయే రాజకీయ పరిణామాలు ముందే పసిగట్టలేం కాబట్టి ఇచ్చిన కాల్ షీట్లలోనే వీలైనంత ఎక్కువ భాగాన్ని పూర్త చేసేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు