ఇండియన్ మాస్టర్ స్టోరీ టెల్లర్ గా ఖ్యాతి గాంచిన రాజమౌళి మరో అరుదైన ఘనత సాధించారు. ప్రతి ఏడాది టైమ్ మీడియా సంస్థ వెలువరించే వరల్డ్ మోస్ట్ 100 ఇన్ఫ్లు యెన్సర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపించిన వాళ్లలో జక్కన్న ఉన్నారని ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకటించడం కంటే గొప్ప ఇంకేముంటుంది. ఇది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే టైమ్ ఈ జాబితాను రూపొందించే క్రమం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉంటుంది. అంత తేలికగా పేరు ఇవ్వరు.
పయోనీర్స్ క్యాటగిరీలో రాజమౌళికి ఈ గౌరవం ఇచ్చారు. ఆయనతో పాటు డోజా క్యాట్, సామ్ ఆల్ట్ మ్యాన్, ఎడ్వర్డ్ రేనాల్డ్స్, మైకెలా శిఫ్రిన్, సామ్ రివెరా, మార్గరెట్ మిచెల్, బెల్లా హడిడ్, థోమ్ బ్రౌనే, ఎలిజిబెత్ మరుమా, రాబిన్ జెంగ్ తదితరులు ఉన్నారు. టైమ్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ జక్కన్న గురించి చెప్పిన మాటలను డిస్క్రిప్షన్ లో పొందుపరిచారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ సాధించాక ఇలాంటి అదనపు పురస్కారాలు దక్కడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. వరల్డ్ మీడియా ఇచ్చిన గుర్తింపుగా పేర్కొంటున్నారు.
ఇక రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ గా మారిపోయారు. మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా బడ్జెట్ పరంగా బిజినెస్ పరంగా ఆకాశమే హద్దుగా సాగనుంది. ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే సంచలనాలు ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్ఆర్ రిలీజై ఏడాది దాటుతున్నా ఇంకా దాని ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. జపాన్ లో వంద రోజులు దాటేసి ఆ దేశంలో ఇప్పటికే నెంబర్ వన్ ఇండియన్ గ్రాసర్ గా సింహాసనం అందుకున్న ఈ పీరియాడిక్ డ్రామా నెలలు గడుస్తున్నా సెన్సేషన్లు మాత్రం ఆపడం లేదు. టైమ్ 100లో రాజమౌళి ఉండటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
This post was last modified on April 14, 2023 6:23 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…