Movie News

తార‌క్‌తో సినిమా ప‌క్కానే కానీ..

త‌మిళంలో చాలా త‌క్కువ సినిమాల‌తో గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమార‌న్. త‌న తొలి చిత్రం పొల్లాద‌వ‌న్ మొద‌లుకుని.. లేటెస్ట్‌గా రిలీజైన విడుద‌లై వ‌ర‌కు అన్నీ క‌ల్ట్ మూవీసే. విడుద‌లై సినిమా తెలుగులో ఈ వారమే విడుద‌ల కానున్న నేప‌థ్యంలో వెట్రిమార‌న్ హైద‌రాబాద్లో విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్నాడు.

ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ సైతం ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. ఎన్టీఆర్‌తో సినిమా చేసే విష‌య‌మై జోరుగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఎదురైన ప్ర‌శ్న‌కు వెట్రిమార‌న్ స‌మాధానం ఇచ్చాడు. తెలుగులో వేరే హీరోల‌తో జ‌ట్టు క‌ట్టే విష‌య‌మై కూడా అత‌ను మాట్లాడాడు.

ధ‌నుష్‌తో తాను తీసిన అసుర‌న్ రిలీజ‌య్యాక.. క‌రోనా-లాక్ డౌన్ అనంత‌రం ఎన్టీఆర్‌ను తాను క‌లిసిన‌ట్లు వెట్రిమార‌న్ చెప్పాడు. త‌మ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. కానీ ఇంకా ఏదీ మెటీరియ‌లైజ్ కాలేద‌ని వెట్రిమార‌న్ తెలిపాడు. చ‌ర్చ‌లు ప్ర‌స్తుతానికి కొన‌సాగుతున్నాయ‌ని.. తాను సినిమా పూర్తి చేయ‌డానికి.. ఇంకో సినిమా మొద‌లుపెట్ట‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటాన‌ని.. కాబ‌ట్టి ఏదీ ఓకే అయ్యే వ‌ర‌కు ధ్రువీక‌రించ‌లేన‌ని వెట్రిమార‌న్ తెలిపాడు. తాను ఆడుగ‌ళం త‌ర్వాత అల్లు అర్జున్‌ను క‌లిసి వ‌డ చెన్నై క‌థ చెప్పాన‌ని.. కానీ బ‌న్నీతో ఆ సినిమా కార్య‌రూపం దాల్చ‌లేద‌ని వెట్రిమార‌న్ చెప్పాడు. ఈ సినిమాను త‌ర్వాత వెట్రి.. ధ‌నుష్‌తోనే తీసిన సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌హేష్ బాబును కూడా క‌లిసి ఒక క‌థ గురించి చ‌ర్చించాన‌ని.. కానీ అది కూడా సెట్ కాలేద‌ని చెప్పాడు.

ఎప్పుడు అన్న‌ది తెలియ‌దు కానీ.. తెలుగులో క‌చ్చితంగా త‌న సినిమా ఉంటుంద‌ని.. ఎన్టీఆర్‌తోనే సినిమా ఉండొచ్చ‌నే సంకేతాల‌ను వెట్రిమార‌న్ ఇచ్చాడు. ఐతే తార‌క్‌తో సినిమా చేసినా.. సినిమా త‌న స్ట‌యిల్లోనే ఉంటుంద‌ని వెట్రిమార‌న్ సంకేతాలిచ్చాడు. త‌న క‌థ‌కు తార‌క్ లాంటి స్టార్ అవ‌స‌రం అనుకునేలాగే ఆ క‌థ ఉంటుంద‌ని చెప్ప‌డం ద్వారా త‌న మార్కు హార్డ్ హిట్టింగ్ సినిమానే చేస్తాన‌ని వెట్రిమార‌న్ చెప్ప‌క‌నే చెప్పాడు.

This post was last modified on April 12, 2023 6:15 am

Share

Recent Posts

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 minute ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

11 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago