తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అప్ కమింగ్ యంగ్ బ్యూటీస్ కి ఈ మధ్య పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కి శ్రీలీల ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూట్ లో చేరిపోయింది. తాజాగా ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా ఈ లిస్టులో తోడయ్యే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్)లో పవర్ స్టార్ కు జంటగా ఈ అమ్మాయిని లాక్ చేసే ప్రతిపాదన బలంగా ఉందట. ఆల్రెడీ నెరేషన్ కూడా పూర్తయ్యిందని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగని ఇన్ సైడ్ టాక్.
ప్రియాంక ఎప్పుడో టాలీవుడ్ డెబ్యూ చేసింది కానీ సక్సెస్ పలకరించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాని గ్యాంగ్ లీడర్ నిరాశపరిచింది. శర్వానంద్ తో మంచి అవకాశంగా ఫీలైన శ్రీకారం సైతం వర్కౌట్ కాలేదు. దీంతో అమ్మడు కోలీవుడ్ లోనే సెటిలైపోయింది. అక్కడ వరసగా శివ కార్తికేయన్ డాక్టర్ – డాన్, సూర్య ఈటి హిట్లు పడటంతో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ చేస్తోంది. ఇంకో ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. ఓజి చేయడమంటే జాక్ పాట్ కొట్టినట్టే. ఇప్పుడు పవన్ చేస్తున్న వాటిలో ఎక్కువ బజ్ అంచనాలున్నది ఈ సినిమా మీదే.
అధికారిక ప్రకటన వచ్చేదాకా చూడాలి. రెండు ఫ్లాపులు పడ్డాయి కాబట్టి తెలుగు దూరమైందని ఫీలవుతున్న ప్రియాంకా మోహన్ కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఓజి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిర్మాత డివివి దానయ్య రాజీ పడకుండా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ని దీని కోసం విదేశాల నుంచి తెప్పించారు. వాటి వర్కింగ్ స్టిల్స్ చూసే ఫ్యాన్స్ కి నిద్ర రావడం లేదు. కొంత భాగం జరిపిన చిత్రీకరణ నుంచి వచ్చిన లీక్స్ ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. అన్నీ టైం ప్రకారం సవ్యంగా జరిగితే ఓజి లేదా ఉస్తాద్ వీటిలో ఒకటి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది.
This post was last modified on April 11, 2023 1:30 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…