Movie News

నాని ఒక్కడికే సాధ్యమైన ఘనత

బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతున్న దసరా యుఎస్ లో సగర్వంగా 2 మిలియన్ మార్కుని నిన్నటితో దాటేసింది. కెరీర్ లో ఇప్పటికే ఏడు వన్ మిలియన్ సినిమాలు పెట్టుకున్న నానికి ఇది మొదటి డబుల్ ధమాకా. అయితే ఇందులో ప్రత్యేకత అది కాదు. విజయ్ దేవరకొండతో సహా ఇతర హీరోలు ఈ ఘనతను అందుకున్నారు. నాని స్పెషల్ ఏంటంటే ఒక డెబ్యూ డైరెక్టర్ తో ఈ మేజిక్ ఫిగర్ ని సాధించడం. ఇప్పటిదాకా ఎవరూ అలా చేయలేకపోయారు. అది కూడా నేటివిటీ మీద ఆధారపడ్డ ఒక పక్కా పల్లెటూరి రివెంజ్ డ్రామాతో అందుకోవడం చిన్న విషయం కాదు.

శ్రీకాంత్ ఓదెల ఈ దెబ్బకు ఒక అరుదైన మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. తొలి చిత్రం సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అందుకోవడం కొత్తేమి కాదు కానీ ఇలా ఓవర్సీస్ లో రికార్డుని సెట్ చేయడం మాత్రం ప్రత్యేకమే. ఇప్పటిదాకా 105 కోట్ల గ్రాస్ ని దాటేసిన దసరా షేర్ రూపంలో 60 కోట్లను నమోదు చేసింది. ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగుతోంది. మొన్న ఆదివారం చాలా చోట్ల తాజాగా రిలీజైన రవితేజ రావణాసుర కంటే దసరాకే ఎక్కువ వసూళ్లు రావడం బట్టి చూస్తే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ నానినే అవుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ వీకెండ్ ఎలా వాడుకుంటాడనేది శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కాబట్టి సమంత గుణశేఖర్ లు కనక కంటెంట్ తో మెప్పిస్తే దసరాకు కొంత బ్రేక్ తప్పదు. లేదూ అలా జరగలేదంటే మాత్రం ధరణి మళ్ళీ ఊచకోత మొదలుపెడతాడు. ఫైనల్ రన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. సులభంగా ఇంకో రెండు మూడు వారాలు స్టడీగా ఉండబోయే నేపథ్యంలో బయ్యర్లు అధిక శాతం థియేటర్లలో కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. మొత్తానికి నాని అనుకున్న ఫీట్ పెద్ద మోతాదులో సాధించేశాడు.

This post was last modified on April 11, 2023 8:41 am

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

1 hour ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

2 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

5 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

5 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 hours ago