ఒకప్పుడు సఖి లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న మాధవన్ ఇటీవలి కాలంలో వైవిధ్యానికి పెద్ద పీఠవేస్తూ స్వీయ దర్శకత్వంతో పాటు మంచి వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. గత ఏడాది రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ తో గొప్ప చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని డైరెక్టర్ గానూ శభాష్ అనిపించుకున్నాడు. నిజ జీవితపు రాకెట్ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథను చూపించిన తీరు అద్భుతంగా వచ్చింది. ఇది నచ్చే షారుఖ్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోలు దీంట్లో చిన్న క్యామియో చేశారు.
దీని స్ఫూర్తితోనే మాధవన్ మరో విజేత కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈసారి నటనకు మాత్రమే పరిమితం కాబోతున్నాడు. భారతదేశపు ఎడిసన్ అఫ్ ఇండియాగా పేరొందిన జీడీ నాయుడు బయోపిక్ లో టైటిల్ రోల్ తనదే. కృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఉంటుంది. నాయుడుగారి పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు. మన దేశంలో మొదటి ఎలెక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది ఈయనే. ఈ రంగంలో ఎన్నో అద్భుత ప్రయోగాలతో గొప్ప పేరుతో పాటు లెక్కలేనన్ని అవార్డులు పురస్కారాలు అందుకున్నారు.
నిజానికి ఈయన గురించి ఇప్పటి తరానికి తెలిసింది చాలా తక్కువే. ఎలాగూ కుర్రకారుకు పుస్తకాలు చదవడం మీద పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఇలాంటి మహనీయుల జీవితాలను సినిమా రూపంలో అందిస్తే కోట్లాది ప్రేక్షకులకు చేరుతుంది. కథల కరువుతో ఒకరకమైన మూస హీరోయిజంతో కొట్టుమిట్టాడుతున్న ట్రెండ్ లో ఇలాంటివి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. అందరికీ ఎక్స్ పరిమెంట్లు చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి మాధవన్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చదగివవి. షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on April 10, 2023 2:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…