టాలీవుడ్లో ఇప్పుడు పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను అప్పుడప్పుడూ స్పెషల్ షోలుగా వేయడం కొత్తేమీ కాదు కానీ.. కొత్త సినిమాల తరహాలో పెద్ద రిలీజ్‌లు ప్లాన్ చేయడం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం.. థియేటర్లలో అభిమానులు విపరీతమైన హంగామా చేయడం.. ఈ మధ్యే ఊపందుకుంది. గత ఏడాది ‘పోకిరి’ సినిమా దగ్గర్నుంచి ఈ ట్రెండ్‌ను చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, ఖుషి సినిమాల రీ రిలీజ్ సందర్భంగా మామూలు హంగామా లేదు థియేటర్లలో. ఇప్పుడు పవన్ మరో సినిమాను రీ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అదేమీ బ్లాక్ బస్టర్ కాదు. ఫ్లాప్ మూవీ. ఆ చిత్రమే.. గుడుంబా శంకర్. ‘జానీ’ సినిమా దారుణంగా బోల్తా కొట్టాక పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలన్న ఉద్దేశంతో పవన్ చేసిన ఈ సినిమా.. 2004లో భారీ అంచనాల మద్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది.
కానీ ‘గుడుంబా శంకర్’లో పవన్ లుక్స్, ఆయన విన్యాసాలు.. పాటలు.. ఫైట్లకు అప్పట్లో మంచి అప్లాజే వచ్చింది. ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదన్న అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతుంటాయి. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రీ రిలీజ్ చేయబోతున్నారట. ఐతే రీ రిలీజ్ పరంగా ఈ సినిమా కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా ఒక రీ రిలీజ్ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట అభిమాన సంఘాల నాయకులు.
ఇందుకోసం ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీర శంకర్‌తో కో ఆర్డినేట్ చేసుకుంటున్నారట. ఇండస్ట్రీలో పవన్‌ను అభిమానించే కొందరు హీరోలతో పాటు టెక్నీషియన్లు ఈ ఈవెంట్‌కు హాజరవుతారట. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నారంటే సినిమాను ఎంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేస్తారో అంచనా వేయొచ్చు. ఫ్యాన్ మూమెంట్స్‌కు ఢోకా లేని ఈ సినిమా స్పెషల్ షోల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on April 10, 2023 2:33 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…