Movie News

రవిబాబును నమ్ముకున్న రామోజీ

తెలుగు మీడియా రంగంలో రామోజీ గ్రూప్ ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా ‘ఈనాడు’ తెలుగులో నంబర్ వన్ పత్రికగా కొనసాగుతోంది. 90వ దశకంలో ఈటీవీ కూడా తిరుగులేని స్థాయిలో ఉంది. కానీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతంగా పోటీ పెరిగిపోయి ఈటీవీ వెనుకబడిపోయింది. ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న ఈటీవీ తనకంటూ ఒక వర్గం ప్రేక్షకులను నిలబెట్టుకుంటూ సాగుతోంది. కానీ టీఆర్పీ రేసులో మాత్రం ‘ఈటీవీ’ బాగా వెనుకబడిపోతోంది. ఇలాంటి టైంలో ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ యాప్ తీసుకొచ్చింది రామోజీ గ్రూప్.

ఐతే ఇప్పుడున్న పోటీలో ఆ పేరుతో యాప్ ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. అందులో రామోజీ నిర్మాణంలో తెరకెక్కిన ఎన్నో క్లాసిక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఈటీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు కూడా పెట్టారు. కానీ దాని సబ్‌స్క్రైబర్లు చాలా తక్కువ.

ఓటీటీ అంటే భారీ పెట్టుబడులు పెట్టాలి. కొత్త కొత్త సినిమాలు కొని అందించాలి. అలాగే సొంతంగా ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేసి ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. అప్పుడే సబ్‌స్క్రైబర్లు పెరుగుతారు. కానీ ట్రెండుకు తగ్గట్లుగా ఈటీవీ విన్ టీం ఏమీ చేయలేకపోతోంది. ఐతే ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్న కంటెంట్‌ను ఉచితంగా కంటెంట్ అందిస్తూ వచ్చిన రామోజీ.. ఇప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నారు. ఏడాదికి రూ.365‌తో సబ్‌స్క్రిప్షన్ పెడుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ పెడితే కంటెంట్ పెంచక తప్పదు. ఇందుకోసం ముందుగా రామోజీ.. దర్శకుడు రవిబాబును నమ్ముకున్నారు.

ఒకప్పుడు రామోజీ నిర్మాణంలో నచ్చావులే, నిన్నిలా సినిమాలు తీశాడు రవిబాబు. అందులో తొలి చిత్రం సూపర్ హిట్ అయితే.. రెండోది పోయింది. ఈ మధ్య దర్శకుడిగా రవిబాబు అస్సలు ఫాంలో లేడు. చివరగా అతను తీసిన ‘క్రష్’ చడీచప్పుడు లేకుండా ఒక ఓటీటీలో రిలీజైంది. మినిమం రెస్పాన్స్ లేదు. ఇలాంటి దర్శకుడు ఈటీవీ విన్ కోసం ‘అసలు’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ మొదలయ్యాక వస్తున్న తొలి ఒరిజినల్ మూవీ ఇది. రవిబాబుతో ‘అవును’ లాంటి సూపర్ హిట్ చేసిన పూర్ణ ఇందులో లీడ్ చేసింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 13న ఈటీవీ విన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ‘ఈటీవీ విన్’ పట్ల జనాలకు ఏమాత్రం క్రేజ్ పెంచుతుందో.. ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు తీసుకొస్తుందో చూడాలి.

This post was last modified on April 9, 2023 8:48 pm

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

1 minute ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

15 minutes ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

24 minutes ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

2 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

3 hours ago

ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ అవ‌స‌రం… ఇదిగో రీజ‌న్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయ‌న‌ను…

3 hours ago