Movie News

సల్మాన్ సినిమాలో ‘తెలుగు’ టచ్ వెనుక..

ఈ మధ్య బాలీవుడ్ హీరోలు, ఫిలి మేకర్స్‌కు సౌత్ వైపు దారి మళ్లుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ఇక్కడి మార్కెట్ మీద దృష్టిపెడుతున్నారు. సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆకర్షణలు జోడిస్తున్నారు. దక్షిణాది సినిమాలు తమ మార్కెట్‌ను కొల్లగొట్టేస్తున్న నేపథ్యంలో.. తాము కూడా సౌత్‌లో విస్తరించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’కు ఇచ్చిన తెలుగు టచ్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక క్యామియో రోల్ చేయగా.. ఆయనతో పాటుగా రామ్ చరణ్ ఒక పాటలో మెరిశాడు. ఆ పాట ప్రోమో కూడా ఇటీవలే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. దీని కంటే ముందు తెలంగాణలో ప్రధాన పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలో ఒక పాట కూడా పెట్టారు సినిమాలో. పూర్తిగా తెలుగులోనే ఆ పాట సాగడం విశేషం.

తెలుగు సినిమాల్లో హిందీ పాటలు చూశాం కానీ.. హిందీ సినిమాలో తెలుగు పాట అన్నది ఊహకైనా అందని విషయం. ఐతే సినిమాకు ఇలా తెలుగు టచ్ ఇవ్వడం.. వెంకీ, చరణ్‌లతో క్యామియోలు చేయించడం ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాలో కూడా ఇందుకు తగ్గ సందర్భం బాగానే కుదిరింది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’.. తమిళ చిత్రం ‘వీరం’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం తెలుగులో ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ అయింది కూడా. ఇందులో అమ్మాయిలంటే అస్సలు పడని హీరోను.. అతడి సోదరులు ఒక అమ్మాయితో ప్రేమలో పడేలా చేస్తారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను మెప్పించేందుకు హీరో, అతడి సోదరులంతా కలిసి ఆమె ఊరికి వెళ్లి తన ఇంట్లోనే ఉంటారు. తామంటే అస్సలు పడని హీరోయిన్ తండ్రిని హీరో, అతడి సోదరులు కలిసి ఇంప్రెస్ చేయడమే ఇక్కడ టాస్క్.

హిందీలో ముంబయి నేపథ్యంగా కథ నడిచి.. హీరోయిన్ ఇంటి సెటప్‌ను తెలంగాణలోని ఒక పల్లెటూరికి మార్చినట్లు తెలుస్తోంది. ఒరిజినల్లో హీరోయిన్‌కు తండ్రి బదులు రీమేక్‌లో హీరోయిన్‌కు సోదరుడి పాత్ర పెట్టారు. ఆ పాత్రనే వెంకీ చేసినట్లు సమాచారం. సల్మాన్, అతడి సోదరులంతా కలిసి తెలంగాణలోని హీరోయిన్ ఇంటికి రావడం.. ఇక్కడి సంప్రదాయాల్లో కలిసి పోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత హీరోయిన్ సోదరుడిని ఇంప్రెస్ చేయడం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుందట. ఆ నేపథ్యంలోనే బతుకమ్మ పాటతో పాటు వెంకీ, చరణ్ కలిసి సందడి చేసే సాంగ్ కూడా వస్తుందట. రంజాన్ కానుకగా ఈ నెల 21నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on April 8, 2023 7:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

19 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

29 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

57 minutes ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

5 hours ago