Movie News

24 రోజులకే దాస్ డిజిటల్ దారి

సెకండ్ హాఫ్ కి పిచ్చెక్కిపోతారు, సీట్ల అంచున కూర్చుంటారని విశ్వక్ సేన్ తెగ ఊరించి ప్రమోట్ చేసుకున్న దాస్ కా ధమ్కీ థియేట్రికల్ రన్ ముగిసింది. ఏప్రిల్ 14న ఆహా యాప్ లో ప్రీమియర్ మొదలు కానుంది. అంటే మూడు వారాలు తిరగడం ఆలస్యం స్మార్ట్ దారి పట్టేసింది. బిజినెస్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యిందో లేదో స్పష్టమైన సమాచారం లేదు కానీ సినిమా ఫెయిలైన మాట వాస్తవం. ఏదైతే విశ్వక్ హైలైట్ గా చెప్పుకున్నాడో అదే పెద్ద మైనస్ గా మారడంతో పాటు ఈసారి మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ జనంలో వర్కౌట్ కాలేదు. పాగల్ స్ట్రాటజీ పని చేయలేదు.

తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని విశ్వక్ సేన్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కు భారీ పారితోషికం ఇచ్చి మరీ కథను కొన్నాడు. నరేష్ కుప్పిలిని తొలుత దర్శకుడిగా తీసుకుని తర్వాత ఏదో కారణంతో తనే మెగా ఫోన్ పట్టాడు. ఎన్ని ట్విస్టులు ఎక్కువ ఉంటే అంత బాగా ఆడియన్స్ థ్రిల్ అవుతారనే అంచనా పూర్తిగా తప్పింది. పాటలు పెద్దగా ఎక్కలేదు. డ్యూయల్ రోల్ చేసిన కష్టమూ ఫలించలేదు. ధమ్కీ 2 తీయాలని ముందే ప్లాన్ చేసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడది దాదాపు డ్రాప్ అయినట్టేనని ఇన్ సైడ్ టాక్.

ఫైనల్ గా టాలీవుడ్ నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ విషయంలో ఎవరూ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని అర్థమైపోయింది. బలగం లాంటి బ్లాక్ బస్టరే మూడు వారాలకు వచ్చినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది. దాస్ కా ధమ్కీ రిలీజ్ కు ముందు ప్రముఖ ఓటిటి సంస్థ మంచి ఆఫర్ ఇచ్చినా విడుదలయ్యాక ఇంకా పెద్ద రేట్ వస్తుందనే నమ్మకంతో దాన్ని తిరస్కరించిన విశ్వక్ ఇప్పుడు రాజీపడి కొన్ని కోట్లు వదుకోవాల్సి వచ్చిందని టాక్. మొత్తానికి దూకుడు కన్నా నెమ్మదితనమే కరెక్టని ఇప్పటికైనా దాస్ కి అర్థమయ్యిందో లేదో.

This post was last modified on April 6, 2023 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిట్ ఫార్ములా నే మరో సారి నమ్ముకున్న జగన్

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ…

1 minute ago

వైసీపీలో ఒకే ఒక్క ‘కుర్రోడు’ ..!

వైసీపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌యి ఏడాది అయినా పెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నోరు…

50 minutes ago

విజయమ్మ లాజిక్ తో జగన్ కు కఫ్టమే

వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…

2 hours ago

రెడ్ బుక్ వ‌ద‌ల‌: మ‌రోసారి లోకేష్ స్ప‌ష్టం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప‌నిచేస్తోంద‌ని ఆరోపించిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే టీడీపీ యువ‌నాయ‌కుడు,…

3 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…

7 hours ago

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

10 hours ago