Movie News

వార్ 2 కోసం తారక్ పారితోషికం

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వార్ 2 వస్తుందన్న వార్త మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా హల్చల్ మాములుగా లేదు. అసలు ఊహించని కాంబినేషన్ తెరపైకి రావడం నిజానికి టాలీవుడ్ పెద్దలు సైతం ముందే కనిపెట్టలేకపోయారు. ఒక్కసారిగా లావా బద్దలైనట్టు ఈ న్యూస్ ప్రచారంలోకి రావడంతో ముంబై మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చేసింది. హృతిక్ తారక్ కలిసి డాన్సులు ఫైట్లు చేయడం చూస్తే థియేటర్లలో కుదురుగా కూర్చోవడం కష్టమేనని ఆల్రెడీ ట్వీట్లు మొదలైపోయాయి. ఇంతకీ వార్ 2కి తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత?

ప్రస్తుతం జూనియర్ కు కేవలం పారితోషికమే వంద కోట్లు చెల్లించే రేంజ్ కు వెళ్ళింది. దక్షిణాది పరిశ్రమలో అతి పెద్ద మొత్తం అందుకుంటున్న టాప్ 5 స్టార్స్ లో చేరిపోయాడు. ఇప్పుడు వార్ 2 కోసం ముప్పై కోట్లు ఆఫర్ చేశారని వినికిడి. అయితే ఇది ప్రత్యేక పాత్ర కోసమా లేక ఫుల్ ప్యాకేజ్ వంద కోట్లు ఇచ్చి పూర్తి స్థాయి పాత్ర చేయిస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో క్యామియోల రూపంలో యష్ రాజ్ స్పైవర్స్ హీరోలందరూ కనిపిస్తారని ఇప్పటికే పలు ఛానల్స్ లో హోరెత్తిపోతోంది.

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ డం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్టు మీదే పూర్తిగా ఫోకస్ పెట్టిన తారక్ ఎప్పుడో కమిటైన ప్రశాంత్ నీల్ సినిమా కన్నా ముందే వార్ 2 పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాకపోతే పాత్ర పరిధి, ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తొలి బాలీవుడ్ స్ట్రెయిట్ డెబ్యూ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అందులోనూ క్రేజీ మూవీ కాబట్టి పఠాన్ కు రెట్టింపు స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఖాయం.

This post was last modified on April 6, 2023 5:04 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

28 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

43 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

3 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago