Movie News

ఈగ సుదీప్ చుట్టూ రాజకీయ వల

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ మనకూ సుపరిచితుడే. రాజమౌళి ఈగలో విలన్ గా నటించాక తెలుగు అభిమానులకు దగ్గరయ్యాడు. సైరా నరసింహారెడ్డిలో అరకురాజుగా కనిపించిన ఈ విలక్షణ నటుడు గత ఏడాది విక్రాంత్ రోణాతో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. యాభై దాటిన వయసులోనూ మంచి బాడీ ఫిట్ నెస్ మైంటైన్ చేసే ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవలే కబ్జలో క్యామియో చేసి డిజాస్టర్ అందుకున్న సుదీప్ చుట్టూ ఇప్పుడు రాజకీయ వలలు కమ్ముకుంటున్నాయి. కారణం రాబోయే ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తానని బహిరంగంగా ప్రకటించడమే.

ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్లు ఈ వార్త చూసి షాక్ తిన్నామని ట్వీట్లు పెట్టడం, కాషాయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఈ చర్యకు స్పందనగా సుదీప్ రాబోయే సినిమాలను థియేటర్ల దగ్గర అడ్డుకుంటామని ప్రతినలు చేయడం ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి సుదీప్ కొంతకాలంగా వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. గత ఏడాది బాలీవుడ్ హీరోలు, హిందీ భాష మీద చేసిన కామెంట్స్ పెద్ద డిబేట్ కి దారి తీశాయి. ఓపెన్ గా మాట్లాడినట్టు ఉన్నా సుదీప్ వ్యాఖ్యలు ఇలా పక్కదారి పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఫైనల్ గా సుదీప్ నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా ప్రచారం చేస్తానని చెప్పడం ద్వారా ఇన్ డైరెక్ట్ గా దిగిపోయినట్టే. వాస్తవానికి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వచ్చినప్పటికీ ఏదో తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆ నిర్ణయం మార్చుకున్నట్టు బెంగళూర్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి రావడం హీరోలకు కొత్తేమీ కాదు కానీ కర్ణాటకలో వీళ్ళు అధికారిన్ని శాసించిన దాఖలాలు అంతగా కనిపించవు. లెజెండరీ నటులు డాక్టర్ రాజ్ కుమార్ సైతం వీటికి దూరంగా ఉంటూ వచ్చారు. మరి సుదీప్ సపోర్ట్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

డార్లింగ్ క్రేజ్ కాపాడుతోంది సాబ్

ది రాజా సాబ్ ఫలితం గురించి మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. ఏదైనా డిఫెండ్ చేసుకుందామన్నా ఆ అవకాశం లేకపోవడంతో…

2 hours ago

కోడిపందెంలో ఏకంగా కోటిన్నర గెలిచాడు

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి…

2 hours ago

ఊహించని షాక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్

ఎవరెవరి దగ్గరికో వెళ్లి ఎన్నో నెరేషన్లు జరుపుకున్న ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రానికి ఉపయోగపడటం ఎవరూ ఎక్స్ పెక్ట్…

3 hours ago

‘ఎవరు బతకాలో, ఎవరు చావాలో నిర్ణయించడానికి మేం ఎవరం’

కారుణ్య మరణం…వైద్యం చేసినా బ్రతికే అవకాశం లేక చావు కోసం ఎదురు చూసే పేషెంట్ల కోసం వారి కుటుంబ సభ్యులు…

4 hours ago

తారక్ ఫ్యాన్స్ హ్యాపీ… బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య స్నేహ భావమే ఉంటుంది. ఆ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బావా…

4 hours ago

ఓవర్ ఫ్లోస్ కేరాఫ్ చిరు

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…

6 hours ago