మొత్తానికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఖరారైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అగ్ర దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ ఓకే అయిందని.. సినిమా ప్రకటించబోతున్నారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. ‘స్టైల్ ప్లస్ సబ్‌స్టెన్స్’ అంటూ ముందే సంకేతాలు ఇచ్చి శుక్రవారం ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పోస్టర్ మీద అల్లు అర్జున్, కొరటాల శివ కాకుండా కనిపించిన మిగతా పేర్లన్నీ కొత్తవే కావడం విశేషమే. ఈ చిత్రంతో బన్నీ తన చిన్ననాటి స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేయబోతున్నాడని ముందే వెల్లడైంది. ఆ ముగ్గురి పేర్లు.. శాండీ, స్వాతి, నట్టీ. ఈ ముగ్గురి గురించి బన్నీ తన ట్వీట్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మీపై నా ప్రేమను ఇలా చూపిస్తున్నా అని పేర్కొన్నాడు.
ఐతే ఈ సినిమా పోస్టర్ మీద మరో కొత్త పేరు కూడా కనిపించింది. అదే.. సుధాకర్ మిక్కిలినేని. ఈ చిత్రంలో మేజర్ పార్టనర్ ఈయనే. కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు ఈ సుధాకర్. ఇతణ్ని నిర్మాతను చేయాలని కొరటాల ఎప్పుడో ఫిక్సయ్యాడు. ‘జనతా గ్యారేజ్’ చేస్తున్న సమయంలోనే సుధాకర్.. కొరటాలకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతై ప్రొడక్షన్ నంబర్ వన్ అంటూ సినిమాను ప్రకటించాడు. ఐతే కొరటాలకు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల అతడితో సినిమా చేయడం ఆలస్యమైంది. ఎట్టకేలకు బన్నీ సినిమాను అతడికి కేటాయించాడు. ప్రస్తుతం హీరోగా అల్లు అర్జున్, దర్శకుడిగా కొరటాల శివల స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పుష్ష, ఆచార్య చిత్రాల తర్వాత వీళ్ల రేంజ్ ఇంకా పెరగొచ్చు. వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సమయానికి బిజినెస్ రేంజ్ రూ.150 కోట్లకు చేరొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టును ఈ హీరో, దర్శకుడు తమ మిత్రులకు కేటాయించడం విశేషమే.
This post was last modified on July 31, 2020 10:22 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…