రవితేజ , సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రావణాసుర’ ఈ నెల 7న థియేటర్స్ లో వస్తుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీం ఎలాంటి హింట్ ఇవ్వకుండా కంటెంట్ గురించి ఏమి చెప్పకుండా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చారు. కేరెక్టర్స్ గురించి అడిగినా , సినిమా గురించి అడిగినా వాళ్ళ నుండి వచ్చిన సమాధానం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇక దర్శకుడు సుధీర్ వర్మ కూడా ఈ సినిమా ఎలా ఉంటుంది ? ఎలాంటి ట్విస్టులు ఉంటాయనేది చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటున్నాడు. అదీ కాక ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేయకపోవడానికి కంటెంట్ అక్కడ ముందే రివీల్ అవుతుందని చెప్పడం మీడియాకి కూడా ఆశ్చర్యం కలిగించింది. అంత గోప్యంగా ఉంచడానికి టీం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రశ్నలు మీడియాలో మొదలయ్యాయి.
అయితే థ్రిల్లర్ సినిమా గురించి రిలీజ్ కి ముందు పెద్దగా ట్విస్టులు చెప్పలేరు. కానీ కంటెంట్ ఇలా ఉంటుంది. పాత్రలు ఇలా ఉంటాయని చెప్పకుండా అన్నీ థియేటర్స్ లోనే అంటూ అక్కడ ప్రేక్షకులకు సర్ప్రయిజ్ ఉంటుందని చెప్తే ఎలా ? రావణాసుర టీం చేస్తున్న ఈ గప్చుప్ ప్రమోషన్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది మరి.
This post was last modified on April 5, 2023 10:09 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…