నైజాం ఏరియాలో చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్లోనే నంబర్ వన్ నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. ప్రస్తుతం కొత్త ఏడాదిలో నిర్మాతగా వారిసు, బలగం లాంటి విజయాలకు తోడు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న రాజు.. పరిశ్రమలో నిర్మాతగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తన కలల ప్రాజెక్టు గురించి అడిగిన ప్రశ్నకు రాజు ఇచ్చిన సమాధానం అభిమానులను ఎగ్జైట్ చేసింది. జటాయు పేరుతో ఒక మెగా సినిమా తీయబోతున్నానని.. అందులో టాప్ టెక్నీషియన్లు, ఎగ్జైటింగ్ స్టార్ కాస్ట్ పని చేస్తారని రాజు తెలిపాడు. అంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి ఆయన వివరాలు వెల్లడించలేదు.
ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో 70 శాతం విజయవంతం అయ్యాయని.. భవిష్యత్తులో సక్సెస్ పర్సంటేజ్ ఇంకా పెంచాలని చూస్తున్నానని రాజు తెలిపాడు. చిరంజీవి, రవితేజలతో సినిమాల గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పూనకాలు లోడింగ్ అని, వారితో వేర్వేరుగా సినిమాలు ఉంటాయిన రాజు తెలిపాడు.
మహేష్ బాబుతో ఒక స్పెషల్ మూవీ తీసే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా రాజు వెల్లడించాడు. తమిళంలో వారిసు తర్వాత మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని.. విజయ్‌తో కూడా ఇంకో సినిమా ఉండొచ్చని రాజు తెలిపాడు. పవన్ కళ్యాణ్‌తోనూ మరో సినిమా చేయాలని చూస్తున్నట్లు చెప్పిన రాజు.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తోనూ ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. సమంత కెరీర్లో శాకుంతలం చాలా స్పెషల్ మూవీ అవుతుందని.. ఇదొక క్లాసీమూవీ అని రాజు పేర్కొన్నాడు.
This post was last modified on April 6, 2023 8:38 am
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…