ఎప్పుడో 2019 సెప్టెంబరులో విడుదలైంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్’. ఆ సినిమా మంచి హిట్ అయినా సరే.. ఇప్పటిదాకా హరీష్ శంకర్ తన కొత్త చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయాడు. అలా అని ఆయనకు క్రేజ్ లేదా, అవకాశాలు లేవా అంటే అదేం కాదు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణే తనతో కొత్త సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగింది.
పవన్‌కు ఉన్న వేరే సినిమా కమిట్మెంట్లు, రాజకీయ కార్యకలాపాల వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలుపెట్టలేకపోయాడు. ఒక దశలో హరీష్ ఈ సినిమా మీద ఆశలు వదులుకుని, వేరే ప్రాజెక్టు వైపు చూస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారానికి తెరదించే కొన్ని నెలల కిందటే పవన్-హరీష్ సినిమాకు ముహూర్త వేడుక జరిపారు.
ఆ తర్వాత షూటింగ్ కోసం మళ్లీ నిరీక్షణ తప్పలేదు. ఐతే ఎట్లకేలకు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. మూడున్నరేళ్లకు పైగా ఎదురు చూపుల తర్వాత బుధవారమే తిరిగి మెగా ఫోన్ పట్టాడు హరీష్. ఈ సినిమా షూట్ మొదలైన సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హ్యాష్ ట్యాగ్ పెట్టి ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ పాట తాలూకు వీడియోను షేర్ చేశాడు హరీష్. ఈ చిత్రం కోసం ఎట్టకేలకు పవన్ డేట్స్ ఇచ్చాడు. భారీ సెట్ తీర్చిదిద్దుకుని హరీష్ అండ్ కో రంగంలోకి దిగింది. కొన్ని రోజుల పాటు విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు పవన్. ఆ తర్వాత సుజీత్ సినిమాను కూడా పవన్ మొదలుపెడతానే సంకేతాలు వస్తున్నాయి.
తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’ ఆధారంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతున్నప్పటికీ.. కథలో మార్పులు చేర్పులు చాలానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ దశరథ్ రచయితగా పని చేయడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల ఒక కథానాయికగా నటించొచ్చనే ప్రచారం జరుగుతోంది.
This post was last modified on April 5, 2023 2:49 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…