షారుఖ్ ఖాన్ కెరీర్‌కు ‘పఠాన్’ సినిమా మామూలు ఊపునివ్వలేదు. ఓ మోస్తరు హిట్ కోసం దాదాపు పదిహేనేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు షారుఖ్. అలాంటిది అతడికి రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చింది ‘పఠాన్’. ఇందులో సల్మాన్ చేసిన క్యామియో సినిమాకే హైలైట్‌గా నిలిచింది. సినిమాను అది మరో లెవెల్‌కు తీసుకెళ్లింది, హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నది షారుఖ్-సల్మాన్ కలయికలో వచ్చే ఫన్నీ యాక్షన్ ఎపిసోడే. ఈ ఎపిసోడ్ చివర్లో నేను కష్టాల్లో ఉన్నపుడు కూడా నువ్వు రావాలి అని అంటాడు సల్మాన్. ఈ డైలాగ్‌తో పరోక్షంగా తన ‘టైగర్-3’ సినిమాలో షారుఖ్ క్యామియో గురించి చెప్పకనే చెప్పినట్లయింది.
ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న టైగర్-3లో షారుఖ్ సందడి చేయడం పక్కా. మరి ఆ క్యామియో ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ రెండు చిత్రాల్లో మిత్రులుగా కనిపించే షారుఖ్, సల్మాన్.. భవిష్యత్తులో శత్రువులుగా మారబోతుండటం విశేషం.
యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్ పేరుతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆదిత్య చోప్రా.. ఈ వరుసలో పఠాన్ వెర్సస్ టైగర్ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. పఠాన్, టైగర్ ఇద్దరూ కూడా గూఢచారులే. ప్రస్తుతానికి ఒకరికొకరు సాయం చేసుకున్న వీళ్లిద్దరూ.. అనుకోకుండా శత్రువులుగానూ మారబోతున్నారన్నమాట.
షారుఖ్, సల్మాన్ కలిసి మల్టీస్టారర్ చేస్తే.. అది కూడా స్పై యాక్షన్ థ్రిల్లర్ అయితే.. అందులో ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడితే.. అభిమానులకు మామూలు కిక్ ఉండదు. సరిగ్గా తీస్తే అది రికార్డ్ బ్రేకింగ్ హిట్ కావడం పక్కా. ఈ చిత్రాన్ని కూడా పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనందే రూపొందించే అవకాశాలున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లోనే అతను ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 5, 2023 6:26 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…